క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- దేశంలోని అనేక రాష్ట్రాల్లో సంతాన ఉత్పత్తి రేటు క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గతంలో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ స్థాయిలో సంతాన ఉత్పత్తి రేటు తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 నివేదిక తాజాగా మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా భారీగానే సంతాన ఉత్పత్తి రేటు తగుముఖం పడుతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉత్తరాది తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ సంతాన ఉత్పత్తి రేటు భారీగా తగు ముఖం పడుతున్నట్లు తేలింది. సంతాన ఉత్పత్తి రేటు తగ్గుముఖం పట్టడం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇది భారత్ ను తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా సంతాన ఉత్పత్తి రేటు తగ్గుముఖం పడుతున్న రాష్ట్రాల్లో గతంలో అత్యధిక జనాభా వృద్ధిరేటుతో దేశానికి పెద్ద సవాలుగా నిలిచిన రాష్ట్రాలు ఉండడం గమనార్హం. వీటిలో ఉత్తరప్రదేశ్, బీహార్, ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో గణనీయంగా సంతాన ఉత్పత్తి రేటు తగ్గుముఖం పడుతున్నట్లు తాజా హెల్త్ సర్వే వెల్లడించింది.
రాష్ట్రాల వారీగా సంతాన ఉత్పత్తి రేటు ఇలా..
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే సిక్స్ నివేదిక ప్రకారం ఈ రాష్ట్రాల్లో జాతీయ సగటుకు అత్యంత సమీపంలోకి తాజాగా వచ్చాయి. గతంలో జాతీయ సగటు కంటే అత్యధికంగా జనాభా రేటు ఉండేది. దీనికి ప్రధానంగా అనేకమైన అంశాలు దోహదం చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. బాలికల విద్య పెరగడం, బాల్యవివాహాలు తగ్గడంతో పాటు ప్రభుత్వాలు విస్తృతంగా అమలు చేస్తున్న కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు ఈ మార్పుకు కారణంగా నిలిచాయి. తాజా నివేదికలను రాష్ట్రాలు వారి వివరాలు పరిశీలిస్తే దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్లో సంతాన ఉత్పత్తి రేటు 2.4 గా ఉండగా, అది ఇప్పుడు 2.2కు పడిపోయింది. దేశంలోనే ఎల్లప్పుడూ అధిక సంతాన ఉత్పత్తి రేటు నమోదు చేసే బీహార్ లో కూడా మార్పు కనిపించింది. గత సర్వేలో 3.0 గా ఉన్న రేటు తాజాగా 2.7 కు తగ్గింది. ఇక దేశంలోనే అత్యంత వేగంగా సంతాన ఉత్పత్తి రేటు తగ్గిన ప్రాంతంగా ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ అధికారులు సృష్టించింది. ఇక్కడ గతంలో 2.7 గా ఉన్న రేటు ఏకంగా 2.2 కు పడిపోయింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మిజోరాం వంటి ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో కూడా జననాల రేటు సగటున 0.3 గా నమోదయింది. అదే సమయంలో దేశంలోని అత్యంత తక్కువ సంతాన ఉత్పత్తి రేటు కలిగిన రాష్ట్రంగా సిక్కిం 1.0 తో నిలిచింది. మరోవైపు గత కొన్ని నీళ్లుగా సంతాన ఉత్పత్తి రేటు క్రమంగా తగ్గుతూ వచ్చిన దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం స్వల్ప పెరుగుదల కల్పిస్తోంది. తెలంగాణలో గతంలో 1.8 గా ఉన్న రేటు తాజా సర్వేలో 1.9 కి పెరిగింది. ఏపీ కర్ణాటకలో ఈ రేటు 1.7 నుంచి 1.8 కి చేరింది. కేరళలో కూడా 1.8కి పెరిగింది ప్రస్తుతం దేశ జాతీయ సగటు 2.0 గా ఉంది.
Gas Price Hike:సామాన్యుడికి మరో షాక్.. LPG సిలిండర్ ధర రూ.29 పెంపు!