క్రైమ్ మిర్రర్, జాతీయం:- దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తన మద్దతును ప్రకటించారు. గత కొద్ది రోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా (SM) వేదికగా ఆమె ఒక భావోద్వేగ భరితమైన పోస్ట్ చేశారు.”ఢిల్లీలో కొన్ని రోజులుగా జరుగుతున్నది చూసి నా గుండె ముక్కలైంది,” అని ఆలియా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. విద్యార్థుల పోరాటం వెనుక ఉన్న కష్టాన్ని, వారి కుటుంబాల త్యాగాలను ఆమె గుర్తు చేశారు. “ప్రతీ విద్యార్థి వెనుక ఒక కల, కుటుంబ త్యాగాలు ఉంటాయి,” అని ఆమె అన్నారు.విద్యార్థులు తమ కోసమే కాకుండా భవిష్యత్తు తరాల కోసం మెరుగైన మార్గాన్ని సృష్టిస్తున్నారని ఆలియా ప్రశంసించారు. “వాళ్లు తమతో పాటు భవిష్యత్తు తరాలకు మెరుగైన మార్గాన్ని సృష్టిస్తున్నారు. వారి ధైర్యం, సంకల్పం స్ఫూర్తినిస్తోంది,” అని ఆమె పేర్కొన్నారు.దేశ భవిష్యత్తు విద్యార్థులే అని నొక్కి చెప్పిన ఆలియా భట్, సమాజానికి ఒక కీలకమైన ప్రశ్నను సంధించారు. “విద్యార్థులే దేశ భవిష్యత్తు. వారి మాటల్ని మనం నిజంగా వింటున్నామా?” అంటూ ఆలోచింపజేసే విధంగా తన పోస్ట్‌ను ముగించారు. ఆలియా భట్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్ల మద్దతును కూడగడుతోంది.
మూత్రంలో రక్తం కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. వైద్యుల హెచ్చరిక!
పేపర్ లీక్‌లపై విద్యార్థుల ఉద్యమానికి సల్మాన్ ఖాన్ మద్దతు.. ఎమోషనల్ పోస్ట్ వైరల్