Homeలైఫ్ స్టైల్మూత్రంలో రక్తం కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. వైద్యుల హెచ్చరిక!

మూత్రంలో రక్తం కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. వైద్యుల హెచ్చరిక!

క్రైమ్ మిర్రర్, హెల్త్ డెస్క్:- మూత్రంలో ఒక్కసారి రక్తం కనిపించినా ఏమాత్రం అజాగ్రత్త చేయవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నొప్పి ఉన్నా, లేకున్నా వెంటనే అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.సాధారణంగా ఇలాంటి లక్షణాలు కిడ్నీ క్యాన్సర్, కిడ్నీలో రాళ్లు లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు సంకేతం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే, మూత్రంలో రక్తం పడటం కచ్చితంగా ఈ వ్యాధుల వల్లే అని నిర్ధారించలేమని, అసలు సమస్య ఏమిటో తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి అని వివరిస్తున్నారు.ముఖ్యంగా కిడ్నీ క్యాన్సర్ అనేది 50 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుందని, అయితే యువతలో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా, ఏ చిన్న అనారోగ్య లక్షణం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

హ్యాట్రిక్‌పై యోగి ఆదిత్య‌నాథ్ గురి….! వ్యూహాత్మ‌కంగా అడుగులు…

పేపర్ లీక్‌లపై విద్యార్థుల ఉద్యమానికి సల్మాన్ ఖాన్ మద్దతు.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు