Homeఆంధ్ర ప్రదేశ్ఏపీ నుంచి రాజ్యసభకు దేవేగౌడ...!

ఏపీ నుంచి రాజ్యసభకు దేవేగౌడ…!

  • కేంద్ర పెద్దల వ్యూహం

  • కేంద్ర మంత్రి హెచ్ డి కుమారస్వామి ద్వారా ప్రయత్నం

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. నలుగురు సభ్యులు రాష్ట్రం నుంచి పదవీ విరమణ చేయడంతో వారి స్థానంలో కొత్త వారి ఎన్నిక జరగనుంది. ఈనెల 18న ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులను ఎన్నుకోనున్నారు. అయితే కూటమికి ఏకపక్ష బలం ఉండడంతో నాలుగు పదవులు దక్కనున్నాయి. అయితే ఈసారి బిజెపికి చాన్స్ లేదని ప్రచారం నడుస్తోంది.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రాజ్యసభ పదవులను బిజెపికి ఇచ్చింది టిడిపి. జనసేనకు ఇంతవరకు ప్రాతినిధ్యం లేదు. అందుకే ఒక పదవి జనసేనకు ఇచ్చి.. మిగతా మూడు పదవులు టిడిపి తీసుకోవాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర బిజెపికి తెలియజేశారు చంద్రబాబు.

బిజెపి కి నో ఛాన్స్..
దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల నుంచి 24 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. అయితే ఇందులో నేరుగా 11 మంది రాజ్యసభ సభ్యులను బిజెపి దక్కించుకోనుంది. ఓ ఆరు చోట్ల మాత్రం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు బలంగా ఉన్నాయి.

అందులో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు రానున్నాయి. అయితే ఈసారి బిజెపికి చాన్స్ ఇవ్వకూడదు అని చంద్రబాబు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ బిజెపి ఆలోచన వేరే విధంగా ఉంది. ఏపీ నుంచి ఎలాగైనా ఒక్క సీటు పొందాలన్న ఆలోచనలు సరికొత్తగా ఒక ప్రణాళిక రూపొందించింది.

కర్ణాటక నుంచి కాకుండా ఏపీ నుంచి…
కర్ణాటకలో జెడిఎస్ కీలక భాగస్వామి. మాజీ ప్రధాని దేవే గౌడ కర్ణాటక నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉంది జెడిఎస్. దేవే గౌడ కుమారుడు కుమారస్వామి కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. పొత్తులో భాగంగా కర్ణాటక నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ పదవి తన తండ్రికి ఇవ్వాలని కుమారస్వామి బలంగా కోరుతున్నారు.

అయితే అక్కడ బిజెపి నేత సదానంద గౌడ కు పదవి ఇచ్చేందుకు హైకమాండ్ నిర్ణయించింది. అందుకే ఏపీ నుంచి దేవే గౌడకు అవకాశం ఇవ్వాలని కోరుతోంది. చంద్రబాబుకు దేవే గౌడతోపాటు కుమారస్వామి అత్యంత సన్నిహితులు. అందుకే వారి ద్వారా ప్రయత్నాలు చేస్తోంది. వారితో సాన్నిహిత్యం ఉండడం, కేంద్ర పెద్దలు కోరుతుండడంతో.. ఏపీ నుంచి తప్పకుండా దేవి గౌడ కు రాజ్యసభ పదవి వచ్చే అవకాశం ఉంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు