Homeట్రావెల్కియా, మారుతి కార్ల కొనుగోళ్ల జోరు...!

కియా, మారుతి కార్ల కొనుగోళ్ల జోరు…!

Crime Mirror, Business Updates: దేశంలో కార్ల అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కారు వినియోగించాలనుకునే వారి అభిలాష నెరవేరుతోంది. దేశంలో ప్రతినెల రికార్డు స్థాయిలో కార్ల కొనుగోళ్లు జరుగుతుండడంతో ఆయా కంపెనీలు భారీగా అమ్మకాలను సాగిస్తున్నాయి. దేశంలో మే నెలలో కార్ల అమ్మకాలు భారీగా సాగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ప్రధానంగా మారుతి సుజుకి, కియా ఇండియా కంపెనీలు రికార్డ్ స్థాయిలో మే నెలలో అమ్మకాలను సాగించాయి. మారుతి సుజుకి అత్యధిక నెలవారి అమ్మకాలను నమోదు చేసినట్లు ఈ కంపెనీ ప్రకటించింది. కంపెనీ మొత్తం అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన చూసుకుంటే 34.76 శాతం పెరిగి 2,42,688 యూనిట్లకు చేరాయి. దేశీ అమ్మకాలు కూడా ఆల్ టైం గరిష్ట స్థాయిలో 1,93,535 యూనిట్లుగా నమోదయ్యాయి.

కియా ఇండియా టోకు విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 23.6 శాతం వృద్ధి చెంది 27,586 యూనిట్లకు చేరాయి. ఈ కంపెనీకి ఇవే అత్యధిక మే నెల అమ్మకాలుగా ఆ సంస్థ వెల్లడించింది. హుండాయ్ మోటార్ దేశీయ అమ్మకాలు కూడా వార్షిక ప్రాతిపదికన 9.1 శాతం వృద్ధి చెంది 47,837 యూనిట్లకు చేరాయి. మహేంద్ర అండ్ మహీంద్రా మొత్తం వాహనాల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 20% వృద్ధి చెంది 99,636 యూనిట్లకు చేరాయి.

టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మొత్తం విక్రయాలు గడిచిన ఏడాది మే నెలతో పోలిస్తే 42 శాతం మేర పెరిగి 59,790 యూనిట్లకు చేరుకున్నాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్ మొత్తం అమ్మకాలు 33,128 యూనిట్లుగా ఉన్నట్లు ఆ సంస్థ తాజాగా వెల్లడించింది. రానున్న రోజుల్లోనూ భారీ స్థాయిలో కార్ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

కార్ల కొనుగోలు చేస్తున్న వారిలో గతంతో పోలిస్తే విభిన్న వర్గాలకు చెందిన ఉద్యోగులు ఉంటున్నారు. ఒకప్పుడు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపారులు మాత్రమే కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపించేవారు. ఇప్పుడు సాధారణ ప్రజలు, మధ్యస్థ ఆదాయం కలిగిన ఎంతో మంది ఉద్యోగులు కూడా కార్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో అమ్మకాలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు.

భారీగా పెరిగిన టు వీలర్ల అమ్మకాలు..

గతంతో పోలిస్తే టూ వీలర్ల అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మే నెలలో మొత్తంగా 5.18 లక్షల వాహనాలను విక్రయించింది. బజాజ్ ఆటో మొత్తం వాహన అమ్మకాలు మే నెలలో వార్షిక ప్రాతిపదికన 20 శాతం వృద్ధి చెంది 4,61,257 యూనిట్లకు చేరాయి. టీవీఎస్ మోటార్ అమ్మకాలు 31 శాతం పెరిగి 5,66,585 యూనిట్లుగా నమోదయ్యాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ మే నెలలో అత్యధిక యూనిట్లను విక్రయించింది. ఈ సంస్థకు చెందిన వాహనాలు 1,03,231 యూనిట్లు అమ్ముడయ్యాయి. సుజుకి మోటార్ సైకిల్ మొత్తం అమ్మకాలు గత ఏడాది మే నెలతో పోలిస్తే మూడు శాతం పెరిగి 1,32,244 యూనిట్లు అమ్ముడయ్యాయి. కార్లతోపాటు మోటార్ సైకిల్ అమ్మకాలు భారీగా పెరగడంతో ఆయా కంపెనీలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు