Homeరాజకీయంబీజేపీకి అన్నామలై షాక్‌.. పార్టీ ఏర్పాటుపై సమాలోచన.!

బీజేపీకి అన్నామలై షాక్‌.. పార్టీ ఏర్పాటుపై సమాలోచన.!

క్రైమ్ మిర్రర్, పాలిటిక్స్:- తమిళనాడులో మరో పార్టీ ఏర్పాటు కానుందా.? బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఐపీఎస్‌ ఆఫీసర్‌ అన్నామలై ఆ దిశగా అడుగులు వేస్తున్నారా.? అంటే అవునన్న సమాధానమే తమిళనాడు రాజకీయ సర్కిల్స్‌ నుంచి వినిపిస్తోంది. తాజాగా తమిళనాడులో చోటుచేసుకుంటున్న పరిణామాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అన్నామలై చేసిన ట్వీట్‌, పలు చోట్ల ఏర్పాటైన పోస్టర్లు వంటి వ్యవహారాలను పరిశీలిస్తే.. తమిళనాట మరో పార్టీ ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం తమిళ రాజకీయ సర్కిల్స్‌లో కూడా ఇదే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. బీజేపీలో తన రాజకీయ భవిష్యత్‌పై స్పష్టత కొరవడిన నేపథ్యంలో ఈ మేరకు అన్నామలై కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గడిచిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉంటారని భావించిన అన్నామలైను.. బీజేపీ అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసింది. దీంతో ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఆ పార్టీలో కొనసాగుతున్నారు. తన రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన బీజేపీనుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. మరో పార్టీలో చేరేందుకు ఇష్టపడని ఆయన.. తానే పార్టీని పెట్టాలని నిర్ణయించుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి తెలియజేసేందుకుపార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ అపాయింట్‌మెంట్‌ కోరినట్టు చెబుతున్నారు. ఆయనున్న కలిసిన తరువాత అన్నామలై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

బీజేపీకి వ్యతిరేకంగా పోస్టుతో ఊహాగానాలు..

తాజాగా కేంద్ర ప్రభుత్వం త్రిభాషా విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం పట్ల అన్నామలై తీవ్రంగా విబేధిస్తున్నారు. ఈ మేరకు ఆయన బహిరంగంగానే కీలక ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఆయన పార్టీని వీడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని కూడా ఆయన ఖండించలేదు. అన్నామలై పార్టీ పెట్టనున్నారంటూ ఒక వార్తాకథనం కూడా వెలువడడంతో ఈ ప్రచారానికి బలం చేకూరినట్టైంది. మక్కల్‌ శక్తి ఇయకమ్మ పేరుతో ఆయన పార్టీ పెట్టపోతున్నారని చెబుతున్నారు. గడిచిన ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం అన్నామలైను పక్కన పెట్టిన తరువాత ఆయనపూర్తిగా సైలెంట్‌ అయిపోయారు. 2021 నుంచి 2025 మధ్య కాలంలో బీజేపీ అధ్యక్షుడిగా పని చేసిన అన్నామలై.. అట్టడుగు స్తాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు గట్టిగానే కృషి చేశారు. తద్వారా పార్టీలో ప్రముఖ నేతగా పేరు సంపాదించుకున్నారు. గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో పోరాటం సాగించిన ఆయన.. తాజాగా జరిగిన ఎన్నికల్లో అదే పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడాన్ని వ్యతిరేకించారు. ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆయన టికెట్‌ తీసుకునేందుకు ఇష్టపడలేదు. పూర్తిగా ప్రచారానికి పరిమితమయ్యారు. తాజా ఫలితాల్లో బీజేపీ దారుణంగా ఓటమి చవి చూడడంతో ఆయన తన రాజకీయ భవిష్యత్‌ను నిర్మించుకునే పనిలోపడినట్టు చెబుతున్నారు. పార్టీ పెడుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న సమయంలోనే.. అన్నామలై 2.0 అవతార్‌ పేరుతో మదురై, కోయంబత్తూరు వంటి ప్రాంతాల్లో ఆయన అనుచరులు పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్లు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ నెల నాలుగో తేదీన అన్నామలై పుట్టిన రోజున పార్టీ ప్రకటన ఉంటుందని ఆయన సన్నిహితులు చెబుతున్నట్టు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై అన్నామలై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. బీజేపీ కూడా అన్నామలై విషయాన్ని సీరియస్‌గా తీసుకుని చర్చించే ప్రయత్నం చేస్తుందా.? లైట్‌ తీసుకుంటుందా.? అన్నది చూడాల్సి ఉంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు