Homeతెలంగాణఉద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ తీపి కబురు.. భారీగా నిధులు విడుదల.!

ఉద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ తీపి కబురు.. భారీగా నిధులు విడుదల.!

ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గడిచిన కొన్నాళ్లుగా పెండింగ్‌లో వివిధ రకాల ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్‌ రెడ్డి ఉద్యోగులకు శుభవార్తను చెప్పారు. ఇప్పటి వరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన వివిధ రకాల బకాయిలకు అవసరమైన రూ.6000 కోట్ల నిధులను విడుదల చేయనున్నట్టు స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు తాజా నిర్ణయంతో మేలు చేకూరనుంది. గత కొన్నేళ్లుగా ఉద్యోగులకు రావాల్సిన ఎరియర్స్‌, రిటైర్డ్‌ ఉద్యోగులు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌తోపాటు ఇతర ప్రోత్సాహకాలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందలాది మంది ఉద్యోగుల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క్‌ నిధులు విడుదల చేస్తామని గతంలో హామీ ఇచ్చారు.

  • రెండు వేల కోట్లు విడుదల..

ఈ హామీ మేరకు తాజాగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. తొలి విడతలో రూ.2 వేలు కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. దీంతో ఉద్యోగులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మిగిలిన నిధులను వీలైనంత వేగంగా విడుదల చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తాజాగా తొలి విడత నిధుల విడుదలకు సంబంధించి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన రూ.4 వేల కోట్ల రూపాయల నిధులను కొద్ది రోజల్లో జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. రిటైర్డ్‌ ఉద్యోగుల జీపీఎఫ్‌ బకాయిలు 100 శాతం మేర క్లియర్‌ చేసేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేయడంతో ఉద్యోగ సంఘాలు నాయకులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క నిధులు విడుదల చేయడంతో ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి …

  1. బిజెపి వ్యూహం.! ఇక ఢిల్లీ చూపు రాష్ట్రం వైపు..

  2. రాజకీయాల్లోకి మంచు మనోజ్.!

  3. కాంగ్రెస్ తో జగన్ రాజీ…! హస్తం అగ్రనాయకత్వం రాయబారం…

  4. కర్ణాటక రాజకీయాల్లో ముగిసిన సిద్ధరామయ్య శకం…!

  5. రేవంత్ గుప్పెట్లో టి-టిడిపి క్యాడర్…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు