Homeఆంధ్ర ప్రదేశ్కొడాలి నాని యాక్టివ్...!

కొడాలి నాని యాక్టివ్…!

  • వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ల సమావేశానికి హాజరు

  • చంద్రబాబుతో పాటు లోకేష్ పై సెటైర్లు

  • అరెస్టుకు భయపడనని తేల్చి చెప్పిన వైనం

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: మాజీమంత్రి కొడాలి నాని వైసీపీలో యాక్టివ్ అయ్యారు. పార్టీలో ఇకనుంచి క్రియాశీలకంగా మారాలని భావిస్తున్నారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ల సమావేశానికి కొడాలి నాని హాజరయ్యారు. ఇకనుంచి తాను యాక్టివ్ అవుతానని తేల్చి చెప్పారు.

గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన సమన్వయకర్తల సమావేశానికి హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు కూడా చేశారు. ముఖ్యంగా పాత ధోరణిలో చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడ్డారు. అరెస్టులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. దీంతో తాను పార్టీలో యాక్టివ్ అవుతానని సంకేతాలు పంపించారు.

మొన్నటి ఎన్నికల్లో ఓటమి..
మొన్నటి ఎన్నికల్లో గుడివాడ నుంచి ఐదోసారి పోటీ చేసి ఓడిపోయారు కొడాలి నాని. ఓడిపోయిన తర్వాత పెద్దగా కనిపించలేదు. అయితే తన స్నేహితుడు వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు సమయంలో ఆయనను పరామర్శించేందుకు వచ్చారు. మధ్య మధ్యలో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడేవారు కూడా. అయితే ఇంతలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు.

ముంబైలోని ఓ ఆసుపత్రిలో ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. దీంతో హైదరాబాదులోని ఇంటికి పరిమితం అయ్యారు. కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకున్నారు. అయితే గుడివాడలో కొడాలి నాని బదులు ప్రత్యామ్నాయం జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో నడిచింది. దానికి తెరదించుతూ తాను యాక్టివ్ అవుతున్నట్లు తాజాగా సంకేతాలు పంపారు కొడాలి నాని.

రెండేళ్లుగా కార్యక్రమాలు లేవు..
గత రెండు సంవత్సరాలుగా గుడివాడలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు పెద్దగా జరగలేదు. కొడాలి నాని పై పోటీ చేసిన టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము గెలిచారు. గెలిచిన నాటి నుంచి గుడివాడలో అందరికీ అందుబాటులో ఉంటున్నారు. ప్రజల్లో కూడా ఆయన పట్ల సానుకూలత వ్యక్తం అవుతుంది. ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి పునరాలోచనలో పడ్డారు.

మొన్న ఆ మధ్యన కొడాలి నానిని పిలిపించి మాట్లాడినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి ఆయన యాక్టివ్ గా కనిపిస్తున్నారు. సమన్వయకర్తల సమావేశానికి హాజరవ్వడమే కాకుండా అరెస్టుకు భయపడను అని తేల్చి చెప్పారు. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అవుతానని స్పష్టతనిచ్చారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు