Homeరాజకీయంబీజేపీ మాస్టర్ ప్లాన్.. ఆ రాష్ట్రాల్లో విజయమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు.!

బీజేపీ మాస్టర్ ప్లాన్.. ఆ రాష్ట్రాల్లో విజయమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు.!

క్రైమ్ మిర్రర్,పాలిటిక్స్:- దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ మరింతగా జనంలోకి వెళ్లేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటుంది. వచ్చే ఏడాది దేశంలోని పలు రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కీలక అడుగులు వేస్తోంది. గడిచిన 12 ఏళ్లుగా దేశాన్ని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పారిస్తోంది. మెజారిటీ రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్డిఏ పార్టీలకు చెందిన ప్రభుత్వాలే ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంతో పాటు మరింత బలంగా క్షేత్రస్థాయిని సిద్ధం చేసుకునే ఉద్దేశంతో బిజెపి మరో సరికొత్త కార్యక్రమానికి సిద్ధమవుతోంది. దేశంలో 12 ఏళ్ల ప్రభుత్వ పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లాలని బిజెపి పెద్దలు నిర్ణయించారు. ప్రధానంగా సీనియర్ కేంద్ర మంత్రులు, పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, పార్టీకి చెందిన సీనియర్ నేతలు దేశవ్యాప్తంగా పర్యటించేందుకు అనుగుణంగా ఒక ప్రణాళికను బిజెపి సిద్దం చేసింది. ఇందులో భాగంగా సమన్వయంతో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం, బహిరంగ సభలు నిర్వహించడం, మీడియాతో ముఖాముఖి నిర్వహించి సత్పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతులు, జాతీయ భద్రత తదితర అంశాల్లో పురోగతిని ప్రజలకు వివరించనన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన మంత్రులు తమ రిపోర్టు కార్డులను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

ఐదు థీమ్ లు సిద్ధం.. జాతీయస్థాయిలో బ్లూ ఫ్రింట్..

దేశంలో 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఐదు థీమ్ లతో ప్రజల్లోకి వెళ్లాలని బిజెపి నిర్ణయించింది. ఇందులో లోక్ సేవ, విరాసత్ బి.. వికాస్ బి, సశక్తికరన్, రాష్ట్ర నిర్మాణ, రాష్ట్ర ప్రథమ్ వంటి ఐదు అంశాలతో 22 ప్రాధాన్య అంశాలు చుట్టూ బిజెపి ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్ళనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కార్యాచరణను బిజెపి సిద్ధం చేసింది. వచ్చే ఏడాది ప్రధమార్ధంలో యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్ అసెంబ్లీలకు, ద్వితీయార్థంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బిజెపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. 2027 జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. ఇవి కాకుండా పలు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఓటర్ల వద్దకు వెళ్లేలా వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో ప్రచారంలో నిమగ్నం కావాలని బిజెపి నాయకత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు