హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గుదల నమోదు చేశాయి. కాగా అంతర్జాతీయ బౌగోళిక రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బంగారు ధరలు కొంత హెచ్చతగ్గుదలను నమోదు చేస్తున్నాయి.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సోమవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,59,050గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,45,790గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,59,200గా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,45,940గా ఉంది (Live Gold Rates).
మరోవైపు వెండి ధరలు కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి (Silver prices today). కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,94,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,84,900గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2,94,900గా, బెంగళూరులో రూ.2,84,900గా ఉంది. బంగారు ధరలు మారుతుంటాయి కావున కొనుగోలుకు ముందు ధరలు తెలుసుకోవాల్సిందిగా సూచన.