Homeఅంతర్జాతీయంAmerica-Iran Peace Deal: యుద్ధానికి ముగింపు దిశగా అమెరికా-ఇరాన్ చర్చలు.. ట్రంప్ కీలక ప్రకటన!

America-Iran Peace Deal: యుద్ధానికి ముగింపు దిశగా అమెరికా-ఇరాన్ చర్చలు.. ట్రంప్ కీలక ప్రకటన!

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు దేశాలు యుద్ధ పరిస్థితులకు ముగింపు పలకడానికి ముందుగా 60 రోజులపాటు తాత్కాలిక శాంతి ఒప్పందం చేసుకునే దిశగా అంగీకారానికి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన  ఎంవోయూ కూడా సిద్ధమైనట్లు అమెరికా అధికారులు.

చర్చలు సానుకూలంగా జరిగాయన్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా సాగాయని అన్నారు. పలు దేశాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ముఖ్యంగా ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఖతార్, టర్కీ, పాకిస్థాన్, జోర్డాన్, బహ్రెయిన్ దేశాలతో చర్చించిన తర్వాత ఈ ఒప్పందాన్ని ఖరారు చేసినట్లు ట్రంప్ తెలిపారు. అయితే, ఈ విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోబోమని కూడా స్పష్టం చేశారు.

ఇక ఇరాన్‌ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించేందుకు కూడా సిద్ధమైనట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలను చేర్చింది. అయితే ఈ వార్తలపై ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. ఆ దేశానికి చెందిన కొన్ని మీడియా సంస్థలు మాత్రం ట్రంప్ చేసిన ప్రకటనలు పూర్తిగా నిజం కాదని వ్యాఖ్యానించాయి.

30 రోజుల్లో హోర్ముజ్‌ జలసంధి ఓపెన్

అదే సమయంలో ఒప్పందం కుదిరితే 30 రోజుల్లో హోర్ముజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకువస్తామని ఇరాన్‌కు చెందిన వార్తా సంస్థ వెల్లడించింది. ప్రపంచ వాణిజ్యంలో హోర్ముజ్‌ జలసంధికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ పరిణామాలు అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇదిలా ఉండగా, భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇరాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విషయంలో ఇరాన్‌ ప్రపంచంలోనే ముందుందని ఆరోపించారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు