Homeక్రైమ్ఛీఛీ....వీడ‌స‌లు భ‌ర్తేనా...అద్దె డ‌బ్బుల‌కు భార్య‌ను, కూతురును...! చివ‌రికి క‌ట‌క‌ట‌ల్లోకి...

ఛీఛీ….వీడ‌స‌లు భ‌ర్తేనా…అద్దె డ‌బ్బుల‌కు భార్య‌ను, కూతురును…! చివ‌రికి క‌ట‌క‌ట‌ల్లోకి…

అహ్మ‌దాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఛీఛీ వీడ‌స‌లు భ‌ర్తేనా…. స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునేలా ఓ మ‌హిళ భ‌ర్త తీసుకున్న నిర్ణ‌యంఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. అద్దె చెల్లించ‌లేని వ్య‌క్తి దారుణ‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న భార్య‌, కుమార్తెపై అత్యాచారం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట్ల చ‌క్క‌ర్లు కొడుతుంది. అయితే, నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని కటకటాల వెనక్కి పంపారు.

వివ‌రాల ప్ర‌కారం గుజరాత్‌లోని సురేంద్రనగర్‌కు చెందిన బాధిత కుటుంబం మోర్బికి వలస వెళ్లింది. ఓ ఇంట్లో నెలకు రూ.2 వేలతో అద్దెకు దిగింది. భార్య, కుమార్తెతో కలిసి కుటుంబ యజమాని చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, కొన్ని నెలలుగా వారిని తీవ్రమైన ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. కనీసం కుటుంబాన్ని పోషించడానికి కూడా డబ్బులు లేకుంగా పోయాయి. మరోవైపు నాలుగు నెలల ఇంటి అద్దె బకాయి పడ్డారు. వారి ఆర్థిక సమస్యలను ఇంటి యజమాని ఆసరాగా చేసుకున్నాడు.

డబ్బులకు బదులుగా అద్దెకు ఉంటున్న వ్యక్తి భార్య, కుమార్తెపై లైంగిక వేధింపులు పాల్పడేందుకు నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని కిరాయికి ఉంటున్న వ్యక్తికి చెప్పి ఒప్పించాడు. అనంతరం మహిళ, బాలికపై అత్యాచారం చేశాడు. బాధిత మహిళ తన తల్లికి విషయం తెలియజేసింది. దీంతో ఆమె మోర్బి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద ఇంటి యజమాని, మహిళ భర్తపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ జె.ఎం.లాల్ తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు