కోదాడ, క్రైమ్‌మిర్రర్: గణపవరం గ్రామంలో గణేష్ చదువు రీత్యా బెంగళూరులో ఉంటూ చదువు పూర్తయిన తరువాత అక్కడే ఉంటూ జాబ్ చేస్తూ న్నాడు. సెలవులు నిమిత్తం తన గ్రామానికి వచ్చి మూడు రోజులు అయితుండగా తన స్నేహితుడు మ్యారేజ్ ఫంక్షన్ కి రాత్రి 8 గంటల సమయంలో వెళ్లి మరల తన స్నేహితులతో కలిసి కనిపించాడు.
తరువాత కనిపించకుండా పోయాడు. గణేష్ కనిపించకపోవడంతో బంధువులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. గణేష్ మృతదేహం లక్ష్యం పురం గ్రామం రోడ్డుకి మామిడి తోటలో ఉందని రైతు చూసి గ్రామస్తులకు తెలియజేశాడు. గణేష్ ఒంటిపైన కత్తి పోట్లు, మెడపైన కత్తి తోటి పొడిచి ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేసి అతి కిరాతకంగా చంపినట్లు పోలీసులు గుర్తించారు.