Homeతెలంగాణహ్యాపీ జర్నీ’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్‌...!

హ్యాపీ జర్నీ’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్‌…!

హైద‌రాబాద్‌,క్రైమ్‌మిర్ర‌ర్‌: గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న హార్ట్‌వార్మింగ్ ఎమోషనల్ డ్రామా ‘హ్యాపీ జర్నీ’ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. అభిరామ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మహిళా భావోద్వేగాలకు ప్రధాన ప్రాధాన్యతనిస్తూ రూపొందుతోంది. బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, తరుణ్ రెడ్డి సహ నిర్మాత వ్య‌వ‌హ‌రిస్తున్నారు.ఏడుగురు మహిళల భావోద్వేగ ప్రయాణాలను ప్రధానంగా చూపించే ప్రయత్నం ఈ చిత్రం చేస్తోంది. అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, పృధ్వీ దండమూడి, వంశీధర్ గౌడ్, రవి శివతేజ పైలా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రతి పాత్రను ఎంతో సహజంగా, భావోద్వేగాలకు దగ్గరగా తీర్చిదిద్దారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతో ప్లెజెంట్‌గా, ఫీల్‌గుడ్ ట్రావెల్ వైబ్‌ను అందిస్తోంది. పారిస్‌లోని ప్రసిద్ధ లూవ్రే పిరమిడ్, ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్, సాఫ్ట్ సన్‌సెట్ బ్యాక్‌డ్రాప్ మధ్య భిన్న తరాల మహిళలు, కొంతమంది యువకులు కలిసి కనిపిస్తున్న తీరు, స్నేహం, ఆప్యాయత, జీవితాన్ని ఆస్వాదించే జర్నీ ని అందంగా ప్రతిబింబిస్తోంది.
“Some trips change plans… Some change lives” అనే ట్యాగ్‌లైన్ లైఫ్ ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుందని సూచిస్తోంది. హ్యాపీ జర్నీ’ కేవలం ట్రావెల్ కథ కాదు… మహిళల భావాలు, అనుబంధాలు, జీవిత మార్పులు, ఆత్మీయతలపై సాగే హృద్యమైన ప్రయాణం. ఈ ఏడుగురు మహిళలు తమ తమ భావోద్వేగ ప్రపంచాలతో ఈ ప్రయాణంలో అడుగుపెట్టి, ఊహించని మార్పులను ఎక్స్ పీరియన్స్ చేస్తారు.

కథ యూరప్‌లోని పారిస్, మాంట్‌పెలియర్ వంటి అందమైన ప్రదేశాల్లో సాగనుంది. భావోద్వేగాలు మన జీవితాలకు దగ్గరగా, సహజంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. పాత్రల మధ్య కెమిస్ట్రీ, సంభాషణలు, ఎమోషన్స్ అన్నీ ఎంతో సహజంగా ఉండనున్నాయి. టెక్నికల్‌గా కూడా ఈ చిత్రం బలంగా ఉంది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, మణికందన్ సుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఛోటా కే ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్ అందిస్తున్నారు. ఫస్ట్ లుక్‌తోనే ఆసక్తిని పెంచిన ‘హ్యాపీ జర్నీ’ త్వరలోనే థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు