Homeఅంతర్జాతీయంBIG BREAKING: NEET 2026 పరీక్ష రద్దు...!

BIG BREAKING: NEET 2026 పరీక్ష రద్దు…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: మే 3, 2026న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ (NEET-UG 2026) పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా రద్దు చేసింది. రాజస్థాన్‌లోని సికార్‌లో పరీక్షకు ముందే వాట్సాప్‌లో ప్రశ్నపత్రం లీక్ అయిందనే బలమైన ఆరోపణల నేపథ్యంలో, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ (CBI) దర్యాప్తుకు ఆదేశించింది. రద్దయిన నీట్ పరీక్షను త్వరలోనే తిరిగి నిర్వహిస్తారు. రీ-ఎగ్జామ్ నిర్వహించే కొత్త తేదీలను, కొత్త అడ్మిట్ కార్డుల జారీ వివరాలను ఎన్‌టీయే తన అధికారిక వెబ్‌సైట్ NTA NEET ద్వారా త్వరలో ప్రకటిస్తుంది తెలిపారు. మే 3న పరీక్ష రాసిన అభ్యర్థులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత వివరాలే కొనసాగుతాయి.

గతంలో విద్యార్థులు ఎంచుకున్న పరీక్ష కేంద్రాల (Exam Centres) ప్రాధాన్యతలే తదుపరి పరీక్షకు కూడా వర్తిస్తాయి. రీ-ఎగ్జామ్ కోసం విద్యార్థుల నుంచి ఎలాంటి అదనపు పరీక్ష ఫీజు వసూలు చేయరు. గతంలో చెల్లించిన ఫీజును రీఫండ్ చేయనున్నట్లు కూడా సమాచారం. విద్యార్థులు, తల్లిదండ్రులు సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని, కేవలం ఎన్‌టీయే అధికారిక ప్రకటనలను మాత్రమే ఫాలో అవ్వాలని అధికారులు సూచించారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు