క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: మే 3, 2026న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ (NEET-UG 2026) పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా రద్దు చేసింది. రాజస్థాన్‌లోని సికార్‌లో పరీక్షకు ముందే వాట్సాప్‌లో ప్రశ్నపత్రం లీక్ అయిందనే బలమైన ఆరోపణల నేపథ్యంలో, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ (CBI) దర్యాప్తుకు ఆదేశించింది. రద్దయిన నీట్ పరీక్షను త్వరలోనే తిరిగి నిర్వహిస్తారు. రీ-ఎగ్జామ్ నిర్వహించే కొత్త తేదీలను, కొత్త అడ్మిట్ కార్డుల జారీ వివరాలను ఎన్‌టీయే తన అధికారిక వెబ్‌సైట్ NTA NEET ద్వారా త్వరలో ప్రకటిస్తుంది తెలిపారు. మే 3న పరీక్ష రాసిన అభ్యర్థులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత వివరాలే కొనసాగుతాయి.
గతంలో విద్యార్థులు ఎంచుకున్న పరీక్ష కేంద్రాల (Exam Centres) ప్రాధాన్యతలే తదుపరి పరీక్షకు కూడా వర్తిస్తాయి. రీ-ఎగ్జామ్ కోసం విద్యార్థుల నుంచి ఎలాంటి అదనపు పరీక్ష ఫీజు వసూలు చేయరు. గతంలో చెల్లించిన ఫీజును రీఫండ్ చేయనున్నట్లు కూడా సమాచారం. విద్యార్థులు, తల్లిదండ్రులు సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని, కేవలం ఎన్‌టీయే అధికారిక ప్రకటనలను మాత్రమే ఫాలో అవ్వాలని అధికారులు సూచించారు.