-
కటిక చీకట్లో కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు
సిద్దిపేట, క్రైమ్‌మిర్రర్: కటిక చీకట్లో కారుదీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. కాళేశ్వరాన్ని కించపరిస్తే ముక్తేశ్వరుడి శిక్ష తప్పదని హెచ్చరించారు. మేడిగడ్డ మరమ్మత్తులు చేతకాక తుమ్మడి హెట్టి వద్ద కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందన్నారు. ఈ సందర్బంగా సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 150 మీటర్లకు ఒప్పందం జరిగితే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తట్టెడు మట్టైనా ఎందుకు తీయలేదని ప్రశ్నించారు.కాంగ్రెస్ మంత్రులకు ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదని ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పక్క రాష్ట్రాలకు బహిరంగ లేఖలు రాస్తూ రెచ్చగొట్టడం మానేసి, కేసీఆర్ లా ఆ రాష్ట్రాలను మెప్పించి తెలంగాణ ప్రయోజనాలు సాధించడం నేర్చుకోండని హితవు పలికారు.
ఎల్ నినో ముప్పుతో రాబోయే కరువును ఎదుర్కోవాలంటే, తక్షణమే మేడిగడ్డ పిల్లర్లకు రిపేర్లు చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. . సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ వద్ద కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయకుండా రాష్ట్ర ప్రయోజనాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాలికి వదిలేసిందని, వచ్చే ఏడాది రాబోయే కరువును ఎదుర్కోవాలంటే మేడిగడ్డ రిపేర్లు వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఆదిలాబాద్ జిల్లా తమ్మిడిహట్టి వద్ద కాంగ్రెస్ మంత్రుల హడావిడి చూసిన తర్వాత ఒక విషయం అర్థమవుతోంది..పని తక్కువ ప్రచారం ఎక్కువ. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు వాగుడు తప్ప చేతలు శూన్యమన్నారు.
ఎల్ నినో ప్రభావంతో కరువు వస్తుందని తెలిసినప్పుడు హడావిడిగా బాయి తవ్వినట్లు కాకుండా, ముందస్తుగా మేడిగడ్డ రిపేర్లు చేయాలన్నారు. కానీ దాన్ని వదిలేసి తమ్మిడిహట్టి కడుతున్నట్లు పేపర్లకు ఫోజులిస్తున్నారు. కురచ బుద్ధితో బీఆర్ఎస్ పై బురద జల్లే కార్యక్రమం తప్ప వారు చేస్తున్నది ఏమిలేదన్నారు.150 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి ఒప్పందం జరిగిందని మంత్రి వివేక్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఒక మంత్రి హోదాలో ఉండి ప్రజలు ఏమనుకుంటారన్న సోయి లేకుండా ఇంత పిచ్చి అబద్ధం మాట్లాడొచ్చా ప్రశ్నించారు. నిజంగానే ఒప్పందం ఉంటే, ఉమ్మడి రాష్ట్రంలో ఏడున్నరేండ్లు అధికారంలో ఉండి కూడా తట్టెడు మట్టైనా ఎందుకు తవ్వలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.