HomeతెలంగాణVijay Devarakonda: "రౌడీ జనార్థన"మూవీ నుంచి విజయ్ దేవరకొండ బర్త్ డే పోస్టర్ రిలీజ్‌...!

Vijay Devarakonda: “రౌడీ జనార్థన”మూవీ నుంచి విజయ్ దేవరకొండ బర్త్ డే పోస్టర్ రిలీజ్‌…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న క్రేజీ మూవీ “రౌడీ జనార్థన”. స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా “రౌడీ జనార్థన” సినిమా రూపొందుతోంది. ఈ రోజు హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు “రౌడీ జనార్థన” మూవీ మేకర్స్.

ఈ బర్త్ డే పోస్టర్ లో వర్షంలో తడుస్తూ చేతిలో పిస్టల్ తో ఉన్న విజయ్ స్టిల్ ఆకట్టుకుంటోంది. ఆయన ఛాతీపై హీరోయిన్ కీర్తి సురేష్ కాలు పెట్టినట్లు చూపించడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ పోస్టర్ యాక్షన్ తో పాటు రొమాంటిక్ యాంగిల్ ను ఎస్టాబ్లిష్ చేస్తోంది. “రౌడీ జనార్థన” సినిమాను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు రౌడీ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ డిసెంబర్ లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు