తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన TPCC ఉపాధ్యక్షులు, కూకట్ పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు గాయత్రినగర్(254) డివిజన్ సీనియర్ నాయకుడు దేవరింటి మస్తాన్ రెడ్డి. ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కోసం బండి రమేష్ చేస్తున్న సేవలను గుర్తించి కార్పొరేషన్ చైర్మెన్ గా నియమించిన సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు మస్తాన్ రెడ్డి. బండి రమేష్ నాయకత్వంలో కూకట్ పల్లిలో కాంగ్రెస్ పార్టీ శక్తివంతంగా తయారైందని.. త్వరలో జరగనున్న బల్దియా ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రవీందర్ ముదిరాజ్ కూడా బండి రమేష్ ను సత్కరించారు.
కార్పొరేషన్ చైర్మెన్ బండి రమేష్ ను సన్మానించిన మస్తాన్ రెడ్డి
By Crime Mirror
0
180
Previous article