Homeతెలంగాణహైదరాబాదులో భారీగా పెరిగిన చికెన్ ధరలు!

హైదరాబాదులో భారీగా పెరిగిన చికెన్ ధరలు!

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో చికెన్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వేసవికాలం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాలలో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి అని షాప్ యాజమాన్యాలు చెబుతున్నాయి. గత ఆదివారం నాడును హైదరాబాదులో స్కిన్లెస్ కేజీ చికెన్ ధర 260 నుంచి 280 పలకగా నేడు ఏకంగా 340 రూపాయలకు పెరిగిపోయింది. కేవలం ఐదు రోజుల వ్యవధిలోని 80 రూపాయలకు పైగా పెరగడంతో చికెన్ కొనుగోలు చేసేటువంటి వినియోగదారులు షాక్ లో ఉండిపోయారు. అప్పుడప్పుడు చికెన్ తినాలనుకున్నటువంటి సామాన్య ప్రజలు సైతం ధరలు చూసి ఆశ్చర్యపోతున్నారు. వేసవికాలం అందులోనూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఫంక్షన్లు మరియు పెళ్లిళ్లు జరుగుతున్న కారణంగా ధరలు అమాంతంగా పెరిగాయని భావిస్తున్నారు. మరోవైపు అధికారులు సైతం ఎప్పటికప్పుడు నాన్ వెజ్ షాపులపై తనిఖీలు చేస్తూ ఉన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చికెన్ ధరలు హాట్ టాపిక్ గా మారిపోయాయి.

పాకిస్థాన్‌లోని ఏ ఉగ్రవాద స్థావరం సురక్షితం కాదు…డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‍‌ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్‌ ఘాయ్…!

TamilNadu Politics: TVK చీఫ్ విజయ్ కీలక నిర్ణయం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు