Homeతెలంగాణఇద్ద‌రి వ్య‌క్తి గ‌త క‌క్ష‌ల‌తో ఊరిని బ‌జారుకు ఈడుస్తున్న‌రు...!

ఇద్ద‌రి వ్య‌క్తి గ‌త క‌క్ష‌ల‌తో ఊరిని బ‌జారుకు ఈడుస్తున్న‌రు…!

  • ఇద్ద‌రి వ్య‌క్తి గ‌త క‌క్ష‌ల‌తో ఊరిని బ‌జారుకు ఈడుస్తున్న‌రు…

  • గ్రామా డ్రైనేజీపై గోడ నిర్మిస్తున్న‌రాంటూ అధికారుల‌కు ఫిర్యాదు

  • అక్క‌డ అస‌లు డ్రైనేజీ లేదు గ్రామ‌స్తుల ఆవేదన

  • ఈ వివాదం పై ఇద్దరికీ గ్రామా కార్యదర్శి నోటీసులు జారీ

  • అందులో ఒకరు తీసుకోకుంటే గోడ‌కు అంటించిన వైన   

  • క్రైమ్ మిర్ర‌ర్‌, మడుగులపల్లి: ఇద్ద‌రి వ్య‌క్తి గ‌త క‌క్ష‌లతో మధ్య గ్రామానికి ఎలాంటి ఉపయోగం లేకున్నా ప్రతి సారి గ్రామాన్ని ర‌చ్చ‌కెక్కిస్తు గ్రామం పరువు తీస్తున్నారంటూ గ్రామస్థులు ఆవేదన చెందుతున్న సంఘ‌ట‌న నల్గొండ జిల్లా, మాడ్గుపల్లి మండలము, పాముల‌ప‌హాడ్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇదే విషయమై అసలు ఏమి జరుగుతుంది అని గ్రామస్థులను అడిగి తెలుసుకోగా, గ్రామంలో నిరుపేద‌లైన తీగల ప్ర‌భాక‌ర్‌కు ఇందిర‌మ్మ ఇల్లు మంజూరు కాగా దానిని నిర్మించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఇంటి గోడను గ్రామం డ్రైనేజీపైనా నిర్మిస్తున్నార‌ని అంబేద్క‌ర్ అనే వ్య‌క్తి ఈ వివాదానికి తెర‌లేపాడ‌ని ప‌లువురు తెలిపారు. గ‌తంలో ఇక్క‌డ డ్రైనేజీ కాల్వ ఉండేద‌ని దాని పైనే ఇల్లు నిర్మించుకుంటున్నార‌ని, ప్రభాకర్ ఇందిరమ్మ బిల్లు నిలిపివేయాల‌ని కోరుతూ ఎంపీడీవో, పంచాయ‌తీ సెక్ర‌ట‌రికి రాత‌పూర్వ‌కంగా అంబేద్క‌ర్ పిర్యాదు చేయ‌డం జ‌రిగింది అన్నారు. ఇట్టి విష‌య‌మై అధికారులు విచారణ చేయమని గ్రామా కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు అని తెలిపారు.

అక్క‌డ అసలు గ్రామం డ్రైనేజీనే లేదు – గ్రామస్థుల ఆవేదన:

వాళ్ళ బజారు అవతల బజారులో 40 ఏళ్ల క్రితం మంచి నీళ్ల‌బావి ఉండేద‌ని ఈ వాడక‌ట్టువాళ్లంత ఆ బావి నుంచి నీళ్లు బొక్కెన తో చేదుకొని నీళ్లు తీసుకెళ్లే వారని, ఆ సమయంలో వృధాగా క్రింద పొయ్యిన నీరు పై బజారు నుండి వాళ్ళ సొంత ఇంటి స్థలం లోంచి క్రిందికి వెళ్ళేవి అన్నారు. కాని ఇప్పుడు ఆ బావి పూడిపోయి ఎవ‌రికి ఉప‌యోగంలేకుండా పోయింద‌ని తెలిపారు.

అక్కడ డ్రైనేజీ సైతం లేద‌ని తెలిపారు. ఆ కాలు వ‌ల్ల ఊరిలో ఎవ‌రికి ఎలాంటి ఉప‌యోగం లేద‌ని పేర్కొన్నారు. కాని ఇద్ద‌రి వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌తో ఊరిని ప్ర‌తి రోజు ఏదో విధంగా ప‌త్రిక‌ల్లో, సోష‌ల్ మీడియాలో వేయిస్తూ ప‌రువు తీస్తున్నార‌ని పేర్కొంటున్నారు. ఎక్క‌డ చూసిన, న‌లుగురు గుమిగూడిన పాముల‌ప‌హాడ్ చ‌ర్చే వినిపిస్తుంద‌ని తెలిపారు. ఏదేమైన ఊరి విష‌యం బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా స‌మ‌స్యను ప‌రిష్క‌రించుకోవాల‌ని గ్రామస్థులు ప‌లువురు పేర్కొంటున్నారు.

కార్యదర్శి ఇరువురికి నోటీసులు జారీ..ఒకరు నిరాకరణ:

ఇల్లు బిల్లును ఆపుద‌ల చేయాల‌ని పిర్యాదు చేసిన అంబేద్క‌ర్‌కు, ఇందిర‌మ్మ ఇల్లు ల‌బ్దిదారుడు ప్రభాకర్ కు పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి మీ భూమికి సంబంధించి ధ్రువ‌ప‌త్రాలు అంద‌జేయాల‌ని ఇద్దరికీ నోటీసులు జారీ చేశారు. కాగా ప్రభాకర్ నోటిసులను తీసుకోగా, అంబేద్క‌ర్ నోటీసులు తీసుకోవడానికి నిరాకరించాడు. ఈక్ర‌మంలో చేసేదేమి లేక అంబేద్క‌ర్ ఇంటి గోడకు నోటీసులు అంటించిన‌ట్లు తెలిపారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు