HomeUncategorizedరజినీ, చిరు వల్ల కానిది.. విజయ్ చేసి చూపించాడు, రాజీకాయాల్లోనూ సూపర్ స్టార్‌గా..!

రజినీ, చిరు వల్ల కానిది.. విజయ్ చేసి చూపించాడు, రాజీకాయాల్లోనూ సూపర్ స్టార్‌గా..!

తమిళనాడు రాజకీయ చరిత్రలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. వెండితెరపై దళపతిగా ముద్ర వేసుకున్న విజయ్.. ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోనూ తిరుగులేని నేతగా అవతరించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ విజయదుందుభి మోగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా టీవీకే శ్రేణులు.. అభిమానులు మిన్నంటేలా సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్ కుటుంబ సభ్యులు సైతం ఎంతో ఉత్సాహంగా పార్టీ గుర్తు అయిన ‘విజిల్’ వేస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లోకి రావడం అంటే కేవలం ప్రసంగాలు చేయడం కాదని.. ప్రజల మనసు గెలవడం అని విజయ్ నిరూపించారు.

గణాంకాల్లో టీవీకే ప్రభంజనం

తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 స్థానాలు అవసరం కాగా.. టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ దిశగా అడుగులు వేస్తోంది. తాజా సమాచారం ప్రకారం టీవీకే 19 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. మరో 88 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న డీఎంకే.. అన్నాడీఎంకే పార్టీలకు గట్టి షాక్ ఇస్తూ విజయ్ పార్టీ అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగింది. ఉద్దండులైన నాయకులు ఉన్న నియోజకవర్గాల్లో సైతం టీవీకే అభ్యర్థులు జైత్రయాత్ర సాగిస్తున్నారు. సినిమా గ్లామర్ ఓట్లుగా మారుతుందా అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ ఓటర్లు కమలదళపతికి బ్రహ్మరథం పట్టారు.

అగ్రనటుల వైఫల్యం.. విజయ్ విలక్షణం

భారతీయ రాజకీయాల్లో గతంలో అనేకమంది అగ్రనటులు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి అడుగు పెట్టకుండానే వెనక్కి తగ్గారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి ఐదేళ్లు కూడా నడపలేక మరొక పార్టీలో విలీనం చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పొత్తులతోనే తన రాజకీయ ప్రస్థానాన్ని నెట్టుకొస్తున్నారు. అటు కమల్ హాసన్.. విజయ్ కాంత్ వంటి వారు ఆరంభంలో సందడి చేసినా క్షేత్రస్థాయిలో రాణించలేకపోయారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. తొలి ఎన్నికల్లోనే ప్రభంజనం సృష్టించారు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఏకంగా ద్రావిడ పార్టీల కొమ్ములిరిచి తన సత్తా చాటారు.

బిగ్గెస్ట్ పొలిటికల్ లీడర్‌గా ఆవిర్భావం

విజయ్ కేవలం సినిమాల్లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కాదు.. రాజకీయాల్లోనూ తిరుగులేని నాయకుడినని నిరూపించుకున్నారు. తమిళనాడు వంటి అత్యంత సంక్లిష్టమైన రాజకీయ వాతావరణంలో ఒంటరిగా పోరాడి విజయం సాధించడం సామాన్యమైన విషయం కాదు. యువత.. మహిళల మద్దతు విజయ్ విజయానికి వెన్నెముకగా నిలిచింది. పారదర్శకమైన పాలన.. అవినీతి రహిత సమాజం కోసం ఆయన చేసిన నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. రాబోయే రోజుల్లో తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై విజయ్ కూర్చోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ALSO READ: విజిల్ మోగింది…ద‌ళ‌ప‌తి ఫ‌స్ట్ అటెంప్ట్‌లోనే పాస్‌…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు