Homeతెలంగాణమాడ్గుల మండలం లో రెవెన్యూ రికార్డుల గందరగోళం…!

మాడ్గుల మండలం లో రెవెన్యూ రికార్డుల గందరగోళం…!

  • సాధాభైనం భూములు ఇతరుల పేర్లకు మార్పిడి..

రంగారెడ్డి ప్రతినిధి, క్రైమ్ మిర్రర్: రంగారెడ్డి జిల్లాలోని మాడ్గుల మండలంలో రెవెన్యూ రికార్డుల మార్పిడి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గతంలో సాధాభైనం ద్వారా భూములు కొనుగోలు చేసిన రైతులు ప్రస్తుతం తమ హక్కులను కోల్పోయే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.నర్సయిపల్లి గ్రామ రెవెన్యూ లో సుమారు 20 నుండి 30 సంవత్సరాల క్రితం మండలానికి చెందిన పలువురు నిరుపేద రైతులు సాధాభైనం పద్ధతిలో భూములు కొనుగోలు చేసి అప్పటి నుండి సాగు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు వారికి పూర్తి హక్కు పత్రాలు అందలేదు.

అదే గ్రామానికి చెందిన ఓ పైరవి కారి ఈ లోపాన్ని ఆసరాగా తీసుకుని కొందరు రియల్ ఎస్టేట్ దళారులు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై సంబంధం లేని వ్యక్తుల పేర్లపై ఆ భూములను ఆన్‌లైన్ రికార్డుల్లో నమోదు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుల వివరాల ప్రకారం, దాదాపు 20 ఎకరాల భూమి ఈ విధంగా అక్రమంగా ఇతరుల పేర్లకు మార్పిడి చేయబడిందన్నారు.

ఏళ్ల తరబడి కబ్జాలో ఉంటూ సాగు చేస్తున్న తమ భూములు ఇలా మారిపోవడం పట్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, పూర్తి స్థాయి విచారణ జరిపి అక్రమ మార్పిడులను రద్దు చేసి, అసలైన యజమానులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో గతం లో జరిగిన ఇలాంటి ఘటనలపై పూర్తి స్థాయి లో విచారణ జరిపి బాధితుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు