HomeతెలంగాణGood news for buyers :కొనుగోలు దారుల‌కు గుడ్‌న్యూస్‌...మ‌రింత దిగిన బంగారు ధ‌ర‌లు...!

Good news for buyers :కొనుగోలు దారుల‌కు గుడ్‌న్యూస్‌…మ‌రింత దిగిన బంగారు ధ‌ర‌లు…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: డాల‌ర్‌బ‌ల‌ప‌డ‌డం, అంత‌ర్జాతీయ మార్కె్‌ట్‌లో డిమాండ్ త‌గ్గ‌డం వంటి కార‌ణాల‌తో బంగారం రోజు రోజుకు త‌గ్గుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వెళ్లిన బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుతుండడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది.

గురువారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,50,430గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,37,890గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,50,580గా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,38,040గా ఉంది (Live Gold Rates).

మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి (Silver prices today). కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,64,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,54,900గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.రూ.2,64,900గా, బెంగళూరులో రూ.రూ.2,54,900 ఉంది.

తాజావార్తలు