న్యూఢిల్లీ, క్రైమ్ మిర్రర్ :
రష్యా-ఉక్రెయిన్ యుద్దం సంవత్సరాల తరబడి కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు ప్రతిదాడులు చేసుకుంటేనే ఉంటున్నారు. . తాజాగా రష్యాలోని మరో ముఖ్యమైన ఆయిల్ ఫెసిలిటీ భారీ అగ్నిప్రమాదానికి గురైంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులే ఈ ప్రమాదానికి కారణం. రష్యాలోని పెర్మ్ ప్రాంతంలో ఉన్న ఒక కీలక ఆయిల్ పంపింగ్ స్టేషన్‌పై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేసింది.
ఈ ప్రాంతం ఉక్రెయిన్ సరిహద్దు నుంచి సుమారు 1,500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దాడి ఉక్రెయిన్ డ్రోన్ సామర్థ్యం ఎంతగా పెరిగిందో చూపిస్తోంది. తమ దేశం జరిపిన సుదీర్ఘ డ్రోన్ దాడి ఇదేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. ఈ కేంద్రం రష్యా ఆయిల్ పంపిణీ వ్యవస్థలో కీలక భాగం కావడంతో, అగ్నిప్రమాదం పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో రష్యా ఆయిల్ రంగాన్ని ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడులు చేస్తోంది. రిఫైనరీలు, నిల్వ కేంద్రాలు, పోర్టులు.. ఇలా కీలక ఇంధన మౌలిక సదుపాయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి