HomeUncategorizedNortheast Militancy: నిన్న మావోయిస్టులు, నేడు ఈశాన్య తీవ్రవాదం.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం

Northeast Militancy: నిన్న మావోయిస్టులు, నేడు ఈశాన్య తీవ్రవాదం.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం

Anti-Terror Operations in Northeas: దేశంలో మావోయిస్టు పార్టీని డెడ్ లైన్ పెట్టి మరీ క్లోజ్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లోని తీవ్రవాదంపై దృష్టి పెట్టింది. ఇటీవల మావోయిస్టులపై ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి దాదాపు తుదముట్టించని తర్వాత, అదే తరహాలో ఈశాన్య ప్రాంతాలను కూడా శాంతియుతంగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

2029 నాటిని నో టెర్రరిజం

2029 నాటికి ఈశాన్యాన్ని తీవ్రవాద రహిత ప్రాంతంగా మార్చాలని కేంద్ర హోంశాఖ ప్రణాళిక రూపొందించింది. మొదటగా మణిపూర్ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టి, అక్కడ జరుగుతున్న హింసాత్మక ఘటనలను అణిచివేయడానికి చర్యలు చేపడుతున్నది. ఈ ఆపరేషన్లలో భాగంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలను ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన సీఆర్పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ వంటి బలగాల నుంచి కొంతమందిని ఈశాన్య రాష్ట్రాలకు తరలించనున్నారు. మణిపూర్‌ తో పాటు అసోం, అరుణాచల్ ప్రదేశ్‌, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో కూడా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయనున్నారు.

యాక్టివ్ గా ఉన్న 16 తీవ్రవాద సంస్థలు

అధికారుల అంచనాల ప్రకారం, ఈశాన్య ప్రాంతంలో సుమారు 16 తీవ్రవాద సంస్థలు క్రియాశీలంగా ఉన్నాయి. వీటిలో మణిపూర్‌లోనే ఎనిమిది సంస్థలు పనిచేస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో భద్రతా చర్యలను మరింత బలపరచాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దశలవారీగా చర్యలు చేపడుతోంది. మావోయిస్టులపై విజయవంతమైన చర్యల తరువాత, ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా శాంతి, స్థిరత్వం తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు