క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్:- ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాటీ లివర్ సమస్యతో ఇబ్బందులు పడుతూ ఆసుపత్రులు చుట్టు తిరుగుతూ ఉన్నారు. అయితే తాజాగా ఈ విషయంపై కొంతమంది నిపుణులు మాట్లాడుతూ.. ఈ ఫ్యాటీ లివర్ సమస్యతో కొన్ని కోట్ల మంది బాధపడుతున్నారు అని తెలిపారు. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ ఫ్యాటీ లివర్ సమస్య అనేది ప్రతి ఒక్కరిని కూడా పట్టిపీడిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది ప్రజలు ఈ వ్యాధి (MASLD) తో బాధపడుతున్నట్లు.. ఇక 2050 నాటికి ఈ సంఖ్య 200 కోట్లకు చేరొచ్చు అని “ది లాన్సెట్” అంచనా వేసింది. ఎక్కువమంది ఆల్కహాల్ తాగడం వల్ల ఈ సమస్య వస్తుంది అని అనుకుంటారు. కానీ ఆల్కహాల్ అలవాటు లేకపోయినా కొవ్వు పేరుకుపోవడం, ఒబిసిటీ, టైప్ టు డయాబెటిస్ మరియు బిపి వల్ల కూడా ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కామెర్లు, అలసట, ఆకలి లేకపోవడం అలాగే బరువు తగ్గిపోవడం వంటివి ఈ వ్యాధి యొక్క లక్షణాలు అని డాక్టర్లు చెప్పారు. కాబట్టి డాక్టర్ల సూచన మేరకు ప్రతి ఒక్కరూ కూడా జీవన శైలిలో భాగంగా మార్పులు మరియు ట్రీట్మెంట్తో ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు.
సింగల్ గానే ఉంటా.. పెళ్లిపై రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
