క్రైమ్ మిర్రర్,తెలంగాణ :- ఈ ఏడాది మిర్చి రైతులను అదృష్టం వరించింది అనే చెప్పవచ్చు. ఎందుకంటే గత సీజన్లో మిర్చి పండించిన రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లేక ఎంతో మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోగా మిగతావారు వచ్చే ఏడాది అయినా మంచి ధరలు పలకక పోతాయా.. అని నిరాశలో ఉండిపోయారు. అయితే ఈ ఏడాది మాత్రం మిర్చి రైతులను అదృష్టం వరించింది అని చెప్పవచ్చు. ఈ రకం, ఆ రకం అనే తేడా లేకుండా అన్ని రకాల మిర్చి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. తాజాగా ఖమ్మం జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లో సాధారణ రకం తేజ మిర్చి క్వింటా 21000 పలికింది. ఏసీలో ఉన్నటువంటి మిర్చి 21,580 రూపాయలకు పైగా పలికాయి. ఇతర దేశాల నుంచి ఆర్డర్లు ఎక్కువగా పెరిగిపోవడంతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిర్చికి భారీగా డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు టమాటా మిర్చి అలాగే ఎల్లో మిర్చి ధరలు 40 నుంచి 50 వేల రూపాయలు వరకు పలుకుతున్న విషయం తెలిసిందే. ఈ రకం మిర్చి ధరలు శుక్రవారం ఒక్కరోజులోనే క్వింటాకు 10000 రూపాయలు పెరిగాయి. దీంతో ఈ ఏడాది మిర్చి పండించిన రైతన్నలు భారీగా లాభాలను పొందడమే కాకుండా ఆనందంలోనూ ఉండిపోయారు. ఇలానే ప్రతి ఏడాది ధరలు రైతన్నలకు గిట్టుబాటు అయ్యే విధంగా ఉంటే అంతకంటే సంతోషం ఇంకేమి ఉండదు అని చెబుతున్నారు.
అరంగేట్రంలోనే అదరగొట్టిన బౌలర్లు.. కోచ్ సంచలన వ్యాఖ్యలు!
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దు చేయాలి…! కార్మికుల ఆందోళన
