Homeఆంధ్ర ప్రదేశ్అమానుషం....ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం...!

అమానుషం….ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం…!

ప‌శ్చిమాగోదావ‌రి, క్రైమ్ మిర్ర‌ర్:ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చిన కామాంధుల చేతిలో దేశంలో ఎక్క‌డో ఒక చోటు మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ప‌సి పిల్ల‌ల నుంచి మొద‌లు కొంటే వృద్దుల వ‌ర‌కు కామాంధుల చేతిలో బ‌ల‌వుతూనే ఉన్నారు. ఇలాంటి ఘ‌ట‌నే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అమానుష ఘ‌ట‌న చోటు చేసుకుంది. ముక్కుప‌చ్చ‌లార‌ని ఆరేళ్ల చిన్నారిపై 60ఏళ్ల వృద్దుడు అత్యాచారం చేసిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది.

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని ఓ మేజర్ పంచాయతీలో ఆరేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కిరాణ షాపునకు వచ్చిన బాలికపై అత్యాచారం చేశాడు.ఈ ఘటనపై బాధిత చిన్నారి తల్లిదండ్రులు ఆచంట పోలీసులు, ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చికిత్స, వైద్య పరీక్షల నిమిత్తం చిన్నారిని పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు