Homeక్రైమ్వృద్ధురాలి హత్య...బంగారంపై క‌న్నేసీ దారుణం...!

వృద్ధురాలి హత్య…బంగారంపై క‌న్నేసీ దారుణం…!

వికారాబాద్, క్రైమ్ మిర్ర‌ర్‌: వికారాబాద్ జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. బంగారం క‌న్నేసి వృద్దురాలిని దారుణంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం రేపింది.వికార‌బాద్ జిల్లా కుల్క‌చ‌ర్ల‌లో అదృశ్య‌మైన వృద్దుఆలు ఆస్థిపంజ‌ర‌మై దొరికింది. పోలీసులు తెలిసిన వివ‌రాల ప్ర‌కారం మండలం లోని బండవెల్కిచర్లకు చెందిన వెంకటమ్మ(63) శనివారం ఇంటి నుంచి బ్యాంకుకు వెళ్లింది. సాయం త్రమైనా తిరిగిరాకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె కూతురు లక్ష్మి తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆది వారం కుల్కచర్ల పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కాల్ లిస్ట్ ఆధారంగా పక్కింటి మహిళ మంజులను విచా రించగా తన భర్త భీమయ్యతో పాటు బంధువు బీరయ్యతో కలిసి చంపినట్లు తేలింది. వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారం కోసం ఆమెను ద్వీచక్ర వాహనం
ఎక్కించుకుని తిర్మలాపూర్ గ్రామ సమీపంలోని పాండవుల బండపైకి తీసుకెళ్లి గొంతునులిమి చంపారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారని ఎస్ఐ రమేశ్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు