HomeజాతీయంTamil Nadu Elections: తమిళనాడులో గెలుపు ఎవరిది?!

Tamil Nadu Elections: తమిళనాడులో గెలుపు ఎవరిది?!

* ప్రీ పోల్ సర్వేల్లో డీఎంకే వైపు మొగ్గు

* అన్న డీఎంకేకు తగ్గని ఆదరణ

* టీవీకే విజయ్ కు సైతం 20% వరకు ఓట్లు

క్రైమ్ మిర్రర్, పొలిటికల్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. ఇక్కడ చాలా పార్టీలు బరిలో ఉన్నాయి. కూటమిగా ముందుకు సాగుతున్నాయి. పార్టీల మధ్య టిక్కెట్ల పంపకాలు పూర్తయ్యాయి. నామినేషన్ల పర్వానికి అంతా సిద్ధం అవుతుంది. అయితే ఇక్కడ అధికార డిఎంకె మరోసారి పవర్ లోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. అన్న డీఎంకే కూటమితో పాటు విజయ్ సైతం బరిలో ఉన్నారు. త్రిముఖ పోటీలో విజేత ఎవరు అన్నది తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ప్రీపోల్ సర్వేలు బయటకు వచ్చాయి. ఆసక్తికర ఫలితాలను ఇస్తున్నాయి ఈ సర్వే సంస్థలు. అయితే మెజారిటీ సర్వే సంస్థలు డీఎంకే వైపు మొగ్గు చూపుతుండడం విశేషం.

* లోక్ పోల్ మెగా సర్వే ప్రకారం.. డీఎంకే 40 శాతం ఓట్లతో 1081 నుంచి 190 సీట్ల వరకు దక్కించుకుంటుందని తేలింది. తద్వారా స్టాలిన్ మరోసారి సీఎం గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఒక్కో నియోజకవర్గంలో 500 మందితో.. లక్ష మంది శాంపిల్స్ తీసుకొని ఈ సర్వే చేసినట్లు సదరు సంస్థ ప్రకటించింది. డీఎంకే వ్యతిరేక ఓటు చీలిపోవడంతో స్టాలిన్ కు కలిసి వచ్చే అంశంగా తేల్చింది.

* ప్యారా వీల్ సర్వే ప్రకారం.. డీఎంకే 41.5% ఓట్లు సాధిస్తుందని.. అన్న డీఎంకే కూటమి 36.2% ఓట్లు సాధిస్తుందని.. డీవీకే విజయ్ పార్టీ 13.6% ఓట్లు… ఎన్టికే 7.9% ఓట్లను పొందే అవకాశం ఉంది. ఈ సర్వే ప్రకారం డీఎంకే స్పష్టమైన మెజారిటీతో మరోసారి అధికారం చేపట్టే ఛాన్స్ కనిపిస్తోంది.

* అగ్ని న్యూస్ సర్వీస్ సర్వే ప్రకారం డీఎంకే సూపర్ విక్టరీ సాధిస్తుందని తేలింది. ఆ పార్టీ ఏకంగా 180 నుంచి 234 సీట్లు దక్కించుకుంటుందని సర్వే తేల్చింది. అన్నా డీఎంకే 54 సీట్లతో నిలవచ్చు అని తేల్చి చెప్పింది.

* ఐఏఎన్ఎస్ మ్యాట్రిచ్ సంస్థ మాత్రం అన్న డీఎంకే కు ఆధిక్యత ఉంటుందని తేల్చింది. 11 నుంచి 127 సీట్లతో ముందు వరుసలో నిలవనుంది. డీఎంకే కనిష్టంగా 104, గరిష్టంగా 114 సీట్లను సాధిస్తుందని తేల్చింది. హంగ్ వస్తుందని తేల్చి చెప్పింది.

* న్యూస్ 18 ఓటు వైపు సర్వే డిఎంకెకు స్వల్ప హెచ్చు ఉంటుందని తేల్చింది. డీఎంకే కు 40 శాతం, అన్నా డీఎంకేకు 38% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. విజయ్ పార్టీకి 15 శాతం వరకు ఓట్లు వస్తాయని తేల్చింది.

* లయోలా కాలేజ్ ఐపిడిఎస్ సర్వేలో విజయ్ పార్టీ పరిస్థితి బాగుంటుందన్న ఫలితాలు వచ్చాయి. విజయ్ పార్టీ ఏకంగా 50 సీట్లు వరకు సాధించవచ్చని.. 80 సీట్లలో ఆ పార్టీ రెండో స్థానంలో నిలుస్తోందని చెబుతోంది. ప్రత్యేకించి యువత విజయ్ పార్టీ వైపు మొగ్గు చూపినట్లు తేల్చింది.

చివరి వరకు ఉత్కంఠ..

ప్రిపోల్స్ ట్రెండింగ్ చూస్తుంటే మాత్రం తమిళనాడు ఫలితాలు ఉత్కంఠ రేపే అవకాశం కనిపిస్తోంది. చాలా సర్వేలు డీఎంకేకు  అధిక్యం ఇచ్చాయి. ఓట్ల పరంగా కూటమి 40 నుంచి 45 శాతం వరకు దక్కించుకునే ఛాన్స్ కనిపిస్తోంది. సీట్ల పరంగా 130 నుంచి 150 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు అన్న డీఎంకే విషయంలో ఒక ప్రచారం ఉంది. ఆ పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు. కానీ 30 నుంచి 40% ఓట్లతో తమిళనాడు రాజకీయాల్లో ఇంకా అన్న డిఎంకె ప్రభావం కొనసాగుతుందని స్పష్టమవుతోంది. అయితే ఏకంగా విజయ్ కు 15 నుంచి 20 శాతం ఓట్లు దక్కుతాయి అంటే ఆయన సైతం తమిళనాడు రాజకీయాల్లో ఆప్షన్ కావచ్చు అని తేలిపోయింది. మొత్తానికి అయితే తమిళనాడు ఎన్నికల్లో అన్ని పార్టీలకు మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ డిఎంకెకే ఎక్కువగా ఛాన్స్ కనిపిస్తోంది. మరి తమిళనాడు ప్రజలు అంతిమ తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments