Thursday, March 26, 2026
HomeతెలంగాణJeevan Reddy: జగన్ మోహన్ రెడ్డిని నమ్మిన జీవన్ రెడ్డి?!

Jeevan Reddy: జగన్ మోహన్ రెడ్డిని నమ్మిన జీవన్ రెడ్డి?!

* ఆయన ఒత్తిడితోనే గులాబీ పార్టీలోకి

* తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో సరికొత్త ప్రచారం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పారు. గులాబీ పార్టీలో చేరుతానని ప్రకటన చేశారు. నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నారు. అయితే ఈ నిర్ణయం వెనుక ఏపీ నేత ఉండడం ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ రాజకీయాలకు ఇష్టపడని జీవన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన  తర్వాత ఏపీ నేత తనకు ఫోన్ చేసిన విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. జీవన్ రెడ్డి పార్టీ మారడం వెనుక ఏపీ నేత ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సదరు ఏపీ నాయకుడి ఒత్తిడి మేరకు మాత్రమే జీవన్ రెడ్డి గులాబీ పార్టీ గూటికి చేరినట్లు సరికొత్త టాక్ నడుస్తోంది.

ఉమ్మడి ఏపీలోనే సీనియర్..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో జీవన్ రెడ్డి ఒకరు. తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన తరువాత క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎదిగారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఆ పార్టీలోనే ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రి పదవి చేపట్టారు. తెలంగాణలో కెసిఆర్ శకం మొదలైన తర్వాత కూడా అక్కడి ప్రజలు జీవన్ రెడ్డిని గుర్తించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సైతం కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం పాలైనప్పటికీ జీవన్ రెడ్డిని గెలిపించిన చరిత్ర కరీంనగర్ జిల్లా ప్రజలది. అంతలా తన ముద్ర చాటుకున్నారు జీవన్ రెడ్డి. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గులాబీ దాటికి తుడిచిపెట్టుకుపోయినప్పటికీ నిలబడ్డారు జీవన్ రెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో గెలిచి కాంగ్రెస్ పార్టీని సజీవంగా నిలపగలిగారు.

రాజశేఖర్ రెడ్డి మాదిరిగా..

ఒక్క మాటలో చెప్పాలంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మాదిరిగా కాంగ్రెస్ పార్టీ అంటే తన మనసులో ఒక కోటనే కొట్టుకున్నారు జీవన్ రెడ్డి. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యం లభించలేదు. అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికి లేని రోజుల్లో జండా పార్టీల నేత ఆయన. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నేతను గుర్తించిన దాఖలాలు లేవు. పైగా కాంగ్రెస్ పార్టీలో అవమానాలతో పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు జీవన్ రెడ్డి. అందుకే విసిగి వేసారి పోయారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టేందుకు ఇష్టపడలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబును ఎదుర్కొన్నారు. తరువాత కెసిఆర్ కు వ్యతిరేకంగా రాజకీయాలు చేశారు. అటువంటి జీవన్ రెడ్డి నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకోలేక సతమతం అవుతున్నారు. అయితే ఆ సమయంలో జీవన్ రెడ్డి లాంటి నేత తమ పార్టీ వైపు వస్తే ప్రయోజనం అని గుర్తించింది గులాబీ పార్టీ. కానీ జీవన్ రెడ్డి నుంచి సానుకూలత రాలేదని తెలుస్తోంది.

జగన్ ఫోన్ కాల్..

అయితే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఏపీ నేత నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అట. తనకు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయం చేసిందని ఆయన చెప్పుకొచ్చారట. అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చి తనకంటూ ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్నానని చెప్పారట. తన తరువాత అంత చరిష్మ మీకే ఉందని చెప్పారట. గులాబీ పార్టీలో చేరాలని సూచించారట. అందుకే జీవన్ రెడ్డి కెసిఆర్ పార్టీలో చేరాలనుకున్నారట. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రచారం నడుస్తోంది. కేవలం జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు మాత్రమే జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. అయితే ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మరో ప్రతిపక్ష పార్టీలో చేరడం అనేది ఒక సాహసమే. కేవలం జగన్మోహన్ రెడ్డి మాటను నమ్మి జీవన్ రెడ్డి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి ఈ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments