రూ. 27,379 కోట్ల బకాయిలే విద్యుత్ విక్రయానికి కారణం
తెలంగాణకు కరెంటు కష్టాలు తప్పవు
వేల కోట్ల ఆర్థిక భారం మోపే అవకాశం ఉందంటూ నిపుణుల హెచ్చరిక
మంచిర్యాల, క్రైమ్ మిర్రర్: తెలంగాణ డిస్కంలకు సింగరేణి మొండి చేయి చూపనుంది. తాజాగా సింగరేణి సంస్థ మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో నిర్మిస్తున్న 800 మెగావాట్ల కొత్త థర్మల్ ప్లాంట్ విద్యుత్తును తెలంగాణకు కాకుండా రాజస్థాన్‌కు విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకోసం రాజస్థాన్ జెన్కోతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన రూ. 27,379 కోట్ల భారీ బకాయిలే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.
ఈ పరిణామం భవిష్యత్తులో తెలంగాణకు కరెంట్ కష్టాలతో పాటు వేల కోట్ల అదనపు ఆర్థిక భారాన్ని మోపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కాగా కొన్ని దశబ్దాలుగా తెలంగాణ నుంచి బొగ్గు తీస్తూ రాష్ట్ర పారిశ్రామిక, వ్యవసాయానికి రంగానికి వెన్నుముకగా నిలిచిన సింగరేణి తన సొంత రాష్ట్రంకు కాకుండా రాజస్థాన్ విద్యుత్పత్తి సంస్థతో జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుకు సిద్దమవుతుంది. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు కొండలా పేరుకపోయాయి.
ఇప్పుడున్న 1200 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నుంచి సరఫరా అవుతున్న విద్యుత్‌కు సంబంధించి తెలంగాణ డిస్కంలు రూ.27,379 కోట్ల బకాయిలు ఉన్నాయి.కాగా ఈ ఆర్థిక లోటుతో సంస్థ మనుడ ప్రశ్నార్థకంగా మారింది.కాగా కొత్త ప్లాంట్ విద్యుత్‌కు నగదు చెల్లింపులు సక్రమంగా చెల్లించే ఇతర రాష్ట్రాలకు ఓపెన్ మార్కెట్ మళ్లించాలని సింగరేణి భావించింది. రాజస్థాన్‌కు విద్యుత్ ఇచ్చి దానికి బదులుగా అక్కడ 1500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ఆ కరెంటు వినియోగించాలనే ప్రతిపాదన కూడ ఉంది.
భవిష్యత్‌లో కష్టాలు తప్పవు…
మన దగ్గర ఉత్పత్తి అయిన కరెంటును పక్క రాష్ర్టానికి విక్రయించడం వల్ల భవిష్యత్‌లో కరెంటు కష్టాలతో భారీ ఆర్థిక భారం పడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా ఇటీవలను జరిగిన మంత్రి వర్గ సమావేశంలో రామగుండంలో కొత్తగా 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి జెన్కో అనుమతి ఇచ్చింది. పెగడపల్లిలో ఇప్పటికే ఉన్న 1200 మెగావాట్ల ప్లాంటు పక్కనే మరో యూనిట్ నిర్మిస్తే భూసేకరణ అవసరం లేకుండా 12కోట్లతోనే నిర్మాణం పూర్తవుతుంది.
కాని తెలంగాణకు కరెంటు విక్రయించి మరో చోట తెలంగాణ కోసం ప్లాంట్ నిర్మించాలని భావిస్తే వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంటుందని, దీని వల్ల రాష్ర్ట ఖజానకు తీవ్రమైన ఆర్థిక పడనుంది. చేతిలో ఉన్న అవకాశాన్ని వేరే రాష్ట్రానికి ధారాదత్తం చేస్తే.. భవిష్యత్తులో తెలంగాణ పారిశ్రామిక వృద్ధికి అవసరమైన చౌక విద్యుత్ లభ్యత తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
సింగరేణి టెండర్ ప్రక్రియను వేగవంతం చేస్తూ కన్సల్టెన్సీ సంస్థల కోసం ప్రకటన జారీ చేయడంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సమన్వయంతో బకాయిల సమస్యను పరిష్కరించుకుని ఈ 800 మెగావాట్ల విద్యుత్తును రాష్ట్ర అవసరాలకే వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
