పాములపహాడ్: గ్రామంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు అండగా ఉంటాం..!
బాధితులకు ఆర్థిక సాయం అందజేత
కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ సభ్యులు వెల్లడి
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, మాడ్గులపల్లి: పాములపహాడ్ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నల్గొండ జిల్లా, మాడ్గులపల్లి మండలము, పాములపహాడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసిన కాంగ్రెస్ కార్యకర్త ఇటీవల ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీద నుంచి జారిపడిన దొంతగాని అమరేందర్‌ను, అదే విధంగా 4వ వార్డు మెంబర్ గా పోటిచేసిన కుర్రి రేణుక భర్త కుర్రి గురువయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యం బాగా లేక ఆపరేషన్ చేయించుకొని ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన సందర్భంగా గ్రామ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వీరిరువురిని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామశాఖ సభ్యలు మాట్లాడుతూ… కాంగ్రెస్ కార్యకర్తకు ఎలాంటి ఆపద వచ్చిన ముందుంటామని స్పష్టం చేశారు. అదే విధంగా నిరుపేద కుటుంబానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తయిన దొంతగాని అమరేందర్ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించి బిస్మేంట్ వరకు బిల్లు కూడ వచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కునుకుంట్ల అంజయ్య, గ్రామ శాఖ అధ్యక్షడు సబ్బు హరికృష్ణ రెడ్డి, ఉపసర్పంచ్ మధు, ఉపాధ్యక్షులు మాండ్ర యాదగిరి, ప్రధాన కార్యదర్శి, వార్డు మెంబర్లు, మాజీ సర్పంచులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది..
