Homeరాజకీయంఇరాన్ క్షిప‌ణి, అణు కార్య‌క్ర‌మాల‌ను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాం....నెత‌న్యాహు కీల‌క వ్యాఖ్య‌లు

ఇరాన్ క్షిప‌ణి, అణు కార్య‌క్ర‌మాల‌ను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాం….నెత‌న్యాహు కీల‌క వ్యాఖ్య‌లు

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: ఇజ్రాయెల్ అధ్య‌క్షుడు నెత‌న్యాహు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తాను మాట్లాడాన‌ని ప‌శ్చిమాసియాలో ఒక ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్ బావిస్తున్నార‌ని నెత‌న్యాహు తెలిపారు. అమెరికా అధ్య‌క్షుడితో జ‌రిపిన చ‌ర్చ‌ల‌ను ఎక్స్‌లో పోస్టు చేసిన అనంత‌రం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు.

ఇజ్రాయెల్ సైన్యం, అమెరికా సైన్యం సాధించిన అద్భుతమైన విజయాలను ప్రాతిపదికగా తీసుకుని, ఇజ్రాయెల్ ప్రయోజనాలకు భంగం కలగకుండా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని ట్రంప్ చెప్పారని నెతన్యాహు వెల్లడించారు. ఒకవైపు శాంతి చర్చల ప్రస్తావన కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ ఇరాన్‌లోను, లెబ‌నాన్‌లో దాడులు కొన‌సాగుతాయ‌ని తెలిపారు.

ఇరాన్ క్షిప‌ణి, అణు కార్య‌క్ర‌మాల‌ను పూర్తిగా ద్వంసం చేసిన‌ట్లు తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఇద్ద‌రు ఇరాన్ అణు శాస్ర్త‌వేత్త‌ల‌ను చంపేసిన‌ట్లు తెలిపారు. త‌మ కీల‌క ప్ర‌యోజ‌నాల కోసం ఎంత‌టి చ‌ర్య‌కైనా వెనుకాడ‌బోమ‌ని నెత‌న్యాహు హెచ్చ‌రించారు.

తాజావార్తలు