Homeరాజకీయం"రాజకీయాల్లో మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి"- నటుడు విశాల్ కీలక వ్యాఖ్యలు

“రాజకీయాల్లో మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి”- నటుడు విశాల్ కీలక వ్యాఖ్యలు

సినీ నటుడు, దర్శకుడు విశాల్ రాజకీయ అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బహిరంగ వేదికలపై మాట్లాడే సమయంలో రాజకీయ నాయకులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తన తాజా చిత్రం ‘మకుటం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

ప్రజా వేదికలపై ప్రసంగించే ముందు పూర్తిగా సిద్ధమైన మాటలతో మాట్లాడితే వివాదాలకు దూరంగా ఉండవచ్చని విశాల్ పేర్కొన్నారు. అప్పటికప్పుడు ఎలాంటి ప్రణాళిక లేకుండా మాట్లాడినప్పుడు కొన్నిసార్లు అనుకోని వ్యాఖ్యలు బయటకు వస్తాయని అభిప్రాయపడ్డారు.

తమిళనాడు రాజకీయ పరిణామాలపై స్పందించిన విశాల్.. తన కాలేజీ రోజుల స్నేహితులు, పరిచయస్తులు ప్రస్తుతం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఆసక్తికరంగా ఉందన్నారు. లయోలా కాలేజీలో తనకు సీనియర్‌గా ఉన్న విజయ్, తన బ్యాచ్‌మేట్ అయిన ఉదయనిధి స్టాలిన్ రాజకీయాల్లోకి రావడం, వారిని చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఊహించనివని తెలిపారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అనేక అంశాల కలయికగా ఉంటాయని, రాజకీయాల్లో జరిగే పరిణామాలను ప్రజలు గమనిస్తుంటారని విశాల్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తమిళనాడు రాజకీయాల్లో ఆయన కూడా అడుగుపెట్టనున్నారనే చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

also read: ‘గట్టర్ జనరేషన్’ నుంచి ‘దేశానికి బలం’ వరకు.. జెన్-జీపై కంగనా రనౌత్ కొత్త వ్యాఖ్యలు

తాజావార్తలు