Tuesday, March 24, 2026
HomeజాతీయంLPG Cylinder: ఇకపై 10 కిలోల గ్యాస్ సిలిండర్, ఇదీ అసలు మ్యాటర్!

LPG Cylinder: ఇకపై 10 కిలోల గ్యాస్ సిలిండర్, ఇదీ అసలు మ్యాటర్!

LPG Cylinder Quantity Reduction: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్న వేళ, సిలిండర్లలో ఎల్‌పీజీ మోతాదును తగ్గించే ప్రతిపాదనపై ఊహాగానాలు చెలరేగాయి. ప్రస్తుతానికి 14.2 కిలోల సిలిండర్లలో 10 కిలోల గ్యాస్ మాత్రమే నింపి తక్కువ ధరకు అందించాలనే ఆలోచన ప్రభుత్వరంగ చమురు సంస్థలు పరిశీలిస్తున్నాయంటూ వార్తలు వచ్చాయి. ఈ నిర్ణయం  ద్వారా ఎక్కువ మంది వినియోగదారులకు గ్యాస్ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశం ఉన్నట్లు ఆ వార్తలు వెల్లడించాయి.

క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

ఈ సమాచారం సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించి ప్రజల్లో ఆందోళనకు దారి తీసింది. ముఖ్యంగా గృహ వినియోగదారులు సిలిండర్ మోతాదు తగ్గిస్తే తమ అవసరాలు ఎలా తీర్చుకోవాలనే సందేహాలు వ్యక్తం చేశారు. అయితే, ఈ ఊహాగానాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. 14.2 కిలోల సిలిండర్లలో గ్యాస్ మోతాదును తగ్గించే ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం దేశంలో రోజువారీ ఎల్‌పీజీ వినియోగం సుమారు 93,500 టన్నులుగా ఉంది. ఇందులో గృహ వినియోగమే 80,400 టన్నులుగా ఉంది. అయితే, ఈ నెల తొలి రెండు వారాల్లో ఎల్‌పీజీ వినియోగం సుమారు 17 శాతం తగ్గినట్లు సమాచారం. యుద్ధ పరిస్థితులు, సరఫరా అనిశ్చితి వంటి అంశాల ప్రభావంతో వినియోగం తగ్గినట్టు నిపుణులు భావిస్తున్నారు.

ఎల్పీజీ విషయంలో కేంద్రం కీలక చర్యలు

ప్రభుత్వం మాత్రం దేశంలో ఎల్‌పీజీ సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోందని వెల్లడించింది. ఈ సందర్భంలో ప్రజలు వదంతులను నమ్మకూడదని సూచించింది. ఇక సిలిండర్ల మోతాదు తగ్గింపుపై వచ్చిన వార్తలు నిరాధారమని ప్రభుత్వం స్పష్టం చేయడంతో వినియోగదారుల్లో కొంత ఊరట నెలకొంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments