Monday, March 16, 2026
HomeజాతీయంFASTag Price Hiked: వాహనదారులకు షాక్.. ఫాస్టాగ్ పాస్ ధర పెంపు!

FASTag Price Hiked: వాహనదారులకు షాక్.. ఫాస్టాగ్ పాస్ ధర పెంపు!

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు తక్కువ ఖర్చుతో టోల్‌ చెల్లింపులు చేసే అవకాశం కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ ధరను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) స్వల్పంగా పెంచింది. ప్రస్తుతం రూ.3,000గా ఉన్న ఈ పాస్‌ ధరను రూ.75 పెంచి రూ.3,075కు నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కొత్త ధర 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ పెంపు 2026–27 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుందని తెలిపారు.

దేశ వ్యాప్తంగా ఖర్చులు టోల్ తగ్గించేందుకు

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే వాహనదారుల టోల్‌ ఖర్చును తగ్గించేందుకు ఈ వార్షిక పాస్‌ను గత సంవత్సరం ఆగస్టు 15న ప్రవేశపెట్టారు. దేశంలోని సుమారు 1,150 జాతీయ రహదారులు మరియు ఎక్స్‌ప్రెస్‌వేల్లో ఉన్న టోల్‌ ప్లాజాల వద్ద ఈ పాస్‌ చెల్లుబాటవుతుంది. ఈ పాస్‌ను తీసుకున్న వాహనదారులు ఒక సంవత్సరం కాలంలో లేదా గరిష్టంగా 200 సార్లు టోల్‌ప్లాజాలను దాటే అవకాశం ఉంటుంది.

నాన్‌ కమర్షియల్‌ వాహనాలకు మాత్రమే!

చెల్లుబాటయ్యే ఫాస్టాగ్‌ ఉన్న నాన్‌ కమర్షియల్‌ వాహనాలకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది. కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్‌ శాఖ గణాంకాల ప్రకారం, ఈ పాస్‌కు ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఇప్పటి వరకు 56 లక్షలకు పైగా వాహనదారులు ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ను తీసుకున్నట్లు సమాచారం. ఇది తరచుగా హైవేల్లో ప్రయాణించే వారికి ఖర్చు తగ్గించే ప్రయోజనకరమైన పథకంగా మారింది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments