HomeతెలంగాణBJP: హైదరాబాద్ కోటపై కాషాయ గర్జన!

BJP: హైదరాబాద్ కోటపై కాషాయ గర్జన!

* ఎంఐఎం ఆధిపత్యానికి  చెక్

* గట్టిగానే గర్జిస్తున్న బిజెపి నేత మాధవీలత

* 2029 ఎన్నికలే టార్గెట్ 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బిజెపిలో చాలామంది ఫైర్ బ్రాండ్లు ఉన్నారు. అటువంటి వారిలో మహిళా నేత కొంపెల్ల మాధవి లత ఉన్నారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మజ్జిస్ కోటలో కాషాయ జెండా పాతాలని గట్టి ప్రయత్నమే చేశారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు ఆమె. కానీ గట్టి వాయిస్ వినిపిస్తున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున. తాజాగా ఎంఐఎం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడానికి తప్పుపట్టారు. తన ఆసుపత్రి పరిధిలో ఫ్లెక్సీలు కట్టడాన్ని తప్పుపడుతూ చించేశారు. ఇఫ్తార్ అంటే అర్థం మార్చేశారని.. ఆకలితో అలమటించే పేదలకు కడుపు నింపాలని… ఆడంబరాలకు పోవద్దని ఎంఐఎం నేతలకు హితవు పలికారు. అయితే ఆమె దూకుడు చూస్తుంటే మాత్రం వచ్చే ఎన్నికల్లో సత్తా చాటే ఎందుకే నన్ను కామెంట్స్ వినిపిస్తున్నాయి.

బలమైన మహిళా నేత..

కొంపెల్లి మాధవి లత హైదరాబాదులో ప్రముఖ హాస్పిటల్ లో ఒకటైన విరంచి ఆసుపత్రికి చైర్మన్. బలమైన హిందూ భావాలను పుణికిపుచ్చుకున్న మహిళా నేత. నగరంలో అనేక హిందూ మత కార్యక్రమాల్లో పాల్గొంటూ.. ఎన్నో పరోపకారాలు చేస్తూ వచ్చారు. హైదరాబాద్ పాతబస్తీలో పుట్టి పెరిగిన మాధవి లత నిజాం కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ.. కోటి ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లో ఆమె ఎన్సిసి క్యాడేట్. ఆ సమయంలో మంచి గాయనిగా, భరతనాట్య కళాకారునిగా గుర్తింపు పొందారు. సుమారు 100కు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్, లతా మా ఫౌండేషన్ ద్వారా విపరీతమైన సేవా కార్యక్రమాలు చేపట్టేవారు. పిల్లల పెంపకం, సనాతన సంప్రదాయాలపై మంచి పట్టున్న మహిళ. పలు ఇంటర్వ్యూలో సైతం వీటిపై అవగాహన కల్పించేవారు. కరోనా కష్టకాలంలో భాగ్యనగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అత్యంత దగ్గర అయ్యారు.

ఎంఐఎం అప్రతిహాస విజయం..

హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం ఎంఐఎం కు కంచుకోట. 1984 నుంచి 2004 మధ్య సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఆరుసార్లు ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించారు. 2004, 2009,2014,2019 ఎన్నికల్లో అసదుద్దీన్ గెలుస్తూ వచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎంఐఎం కు చెక్ పెట్టాలని చూసింది భారతీయ జనతా పార్టీ. బలమైన మహిళా నేతగా భావిస్తూ మాధవి లతను బరిలో దించింది. త్రిముఖ పోటీలో గట్టిగానే పోరాటం చేశారు మాధవి లత. కానీ ఫలితం మరోసారి ఎంఐఎం కు చిక్కింది. అందుకే ఈసారి ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తున్నారు మాధవి లత. 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏ చిన్న అవకాశం వచ్చినా జారవిడుచుకోవడం లేదు మాధవి లత.

ఫ్లెక్సీల చించివేత..

హైదరాబాదులో రంజాన్ ఇఫ్తార్ విందులు ఇప్పుడు రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. బంజారాహిల్స్ లోని విరించి ఆసుపత్రి సమీపంలో ఎంఐఎం నాయకులు ఏర్పాటు చేసిన సామూహిక ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను బిజెపి మహిళా నేత మాధవి లత స్వయంగా చించేసారు. అయితే ఇలా ఫ్లెక్సీలు చించేసేందుకు ఎంతో ధైర్యం ఉండాలి. కానీ ఎక్కడ వెనక్కి తగ్గలేదు మాధవి లత. ఆమె దూకుడు చూస్తుంటే మాత్రం మూడేళ్లలో ఎంఐఎం ను కూకటి వేళ్ళతో పెకిలించాలన్న కసి కనిపిస్తోంది. మరి ఆమె ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు