Homeసినిమామరి కాసెపట్లో పవన్ కళ్యాణ్ ట్రైలర్‌ విడుదల..!

మరి కాసెపట్లో పవన్ కళ్యాణ్ ట్రైలర్‌ విడుదల..!

  • మార్చి 15 సాయంత్రం 5 గంటల ప్రీ-రిలీజ్ ఈవెంట్..

  • మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల…!

  • మార్చి 19న తెల్లవారుజామున 4 AM లేదా 5 AM నుండి బెనిఫిట్ షోలు..

క్రైమ్ మిర్రర్, సినిమా బ్యూరో: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం” విడుదలకు సిద్ధమైంది. హరీష్ శంకర్ దర్శకత్వం తెరకెక్కనున్న పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు.

చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” అధికారిక ట్రైలర్‌ను ఈ రోజు అనగా మార్చి 14, శనివారం సాయంత్రం 6:30 గంటలకు విడదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది చిత్ర బృందం..  కాగా మార్చి 15 (ఆదివారం) సాయంత్రం 5 గంటల నుండి హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో అత్యంత భారీగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

మార్చి 19న తెల్లవారుజామున 4 AM లేదా 5 AM నుండి బెనిఫిట్ షోలు ప్రదర్శించేందుకు అనుమతి లభించింది. ఈ షో టికెట్ ధర రూ. 500గా నిర్ణయించారు.  చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ (DSP) పాటలు అందించగా, తమన్ (S. Thaman) బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు