రంగారెడ్డి,క్రైమ్ మిర్రర్:- కడ్తాల్ మండలం చరికొండ గ్రామ శివారులో ఫారెస్ట్ భూమి విషయంలో అధికారుల తీరుపై వివాదం నెలకొంది. గ్రామ శివారులో బ్రతుకు తెరువు కోసం కొందరు గ్రామస్తులు సుమారు 20 సంవత్సరాల క్రితం అటవీ భూమిలో గుడిసెలు వేసుకుని పశువులు, మేకల కోసం దొడ్డిలను నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన నిరుపేద వ్యక్తి గజ్జ రమేష్ జీవనోపాధి కోసం తాత్కాలికంగా పంచర్ షాప్ నిర్మించుకుంటున్నాడు. శనివారం గ్రామ కార్యదర్శి అక్కడికి వచ్చి షాప్‌ను అక్కడి నుంచి తొలగించాలని హెచ్చరించినట్లు బాధితుడు తెలిపారు.తాను కుటుంబాన్ని పోషించుకోవడానికి చిన్న పంచర్ షాప్ ఏర్పాటు చేసుకుంటే కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారని గజ్జ రమేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఫారెస్ట్ భూమి పేరుతో గ్రామ కార్యదర్శి తనపై పెత్తనం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డాడు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి పేదవారికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రోడ్డు మీద డబ్బు దొరికితే ఏం చేయాలో తెలుసా?
ఉన్నాది ఘాతుకం.. పెళ్లికి నిరాకరించిందని యువతికి ‘HIV’ రక్తాన్ని ఎక్కించాడు
