క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి:-
రంగారెడ్డి జిల్లా,కడ్తాల్ మండలం, మైసిగండిలోని గిరిజన ప్రభుత్వ పాఠశాలలో P&G Shiksha అందిస్తున్న
EraseThe LearningGap లక్ష్యంతో సాగుతున్న ప్రత్యేక శిక్షా కోటి మంది జీవితాల్లో మార్పు తీసుకువచ్చిందని దేశంలోని వెనుకబడిన ప్రాంతాల చిన్నారి విద్యార్థుల చదువును మెరుగుపరచడమే లక్ష్యంగా తమ కృషిని కొనసాగిస్తోందనీ.. చదువులో వెనుకబడటం అనే సమస్యపై P&G Shiksha గళమెత్తుతూనేఒక తరగతి గది నుండి కోటి ప్రయాణాల వరకు దేశవ్యాప్తంగా కోటి మంది పిల్లలను చేరుకుని, వారి జీవితాల్లో సానుకూల మార్పును తెచ్చినట్లు P&G Shiksha ప్రకటించింది.
గత రెండు దశాబ్దాలుగా P&G Shiksha కేవలం పాఠశాలల మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా, మారుతున్న విద్యా వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా అభ్యసన లోపాలను నివారించడం మరియు వాటిని సరిదిద్దడంపై దృష్టి సారించి సమగ్రమైన మార్పులను తీసుకొస్తున్నట్లు P&G India సీనియర్ డైరెక్టర్ రజత్ బ్రార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ తారలు సమీరారెడ్డి, ప్రణీత మాట్లాడుతూ.. చదువులో వెనుకబాటుతనం ఎక్కడైతే ఎక్కువగా కనిపిస్తుందో, సరైన సహాయం అందిస్తే ఎక్కడైతే గొప్ప మార్పు వస్తుందో అటువంటి ప్రాంతాలకు ప్రతీకగా ఈ పాఠశాలను వేదికగా ఎంచుకున్నారు. కేవలం చదవడమే కాకుండా అర్థం చేసుకుంటూ చదవడం ఎంత ముఖ్యమో వివరించడానికి విద్యావేత్తలు, భాగస్వాములు నిపుణులు వెల్లడించారు.
