Homeఆంధ్ర ప్రదేశ్కూట‌మి నాయ‌కుల క‌ర్క‌శ‌త్వం

కూట‌మి నాయ‌కుల క‌ర్క‌శ‌త్వం

  • మ‌హిళా స‌ర్పంచ్ అని చూడ‌కుండా బందించిన వైనం
  • కూట‌మిలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువైందంటూ ప‌లువురి ఆవేద‌న‌
అనకాపల్లి, క్రైమ్ మిర్ర‌ర్‌ : అన‌కాప‌ల్లిలో కూట‌మి నేత‌ల అరాచ‌కాలు మ‌హిళ‌ల‌ను బంధించే ప‌తాక స్థాయికి చేరుకున్నాయి. మ‌హిళ స‌ర్పంచ్ అని చూడ‌కుండా కూట‌మినేత‌లు క‌ర్క‌శ‌త్వంగా రాత్రి వ‌ర‌కు బంధించారు. కూట‌మి ప్ర‌భుత్వంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువైందంటూ ప‌లువురు ఆవేద‌న చెందుతున్నారు.
అచ్యుతాపురం మండ‌లం నున‌ప‌ర్తి గ్రామంలో బీజేపీ మ‌హిళ స‌ర్పంచ్ పై టీడీపీ నేత‌లు దాడికియ‌త్నించారు. తాము వ్య‌తిరేకించే అంశాల‌ను ఎలా ఆమోదం తెలుపుతార‌ని గొడ‌వ‌కు దిగారు. స‌మావేశం ర‌ద్దు చేస్తూ ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టారు.
కుదుర‌ద‌ని స‌ర్పంచ్ అనురాధ చెప్ప‌డంతో స‌ర్పంచ్‌ను, సెక్ర‌ట‌రీ మ‌ధును బంధించారు. రాత్రి 10 గంట‌లు గ‌డుస్తున్న బీసీ మ‌హిళా స‌ర్పంచ్‌నువిడిచి పెట్ట‌లేదు. ఆ త‌రువాత విడిచిపెట్టిన‌ట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండ‌గా ఇలా మ‌హిళ స‌ర్పంచ్‌పై దురుసుగా ప్ర‌వ‌ర్తించిన తీరును కూట‌మి నాయ‌కుల తీరుపై ప‌లువురు విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు.

తాజావార్తలు