Homeతెలంగాణరేపు పరీక్ష రాసే ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్?

రేపు పరీక్ష రాసే ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్?

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు జరుగునున్న విషయం తెలిసిందే. మొత్తం 1945 ఎగ్జామ్స్ సెంటర్లలో 9,97,075 మంది ఎగ్జామ్స్ రాయనున్నారు. అయితే ఈ క్రమంలోనే తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ రాసే విద్యార్థి, విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ తెలిపింది. ఈ ఎగ్జామ్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుండగా స్టూడెంట్స్ ఒక గంట ముందుగానే ఎగ్జామ్స్ సెంటర్ కు చేరుకోవాలి అని బోర్డు సూచించింది. ఒకవేళ ఏదైనా అనుకోని సమస్యలు ఉంటే పరీక్ష సమయానికి ఐదు నిమిషాలు లేట్ అయినా విద్యార్థులను అనుమతిస్తాము అని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తాజాగా తెలిపారు. కాబట్టి ఉదయం 9:05 నిమిషాల వరకు కూడా విద్యార్థులకు అవకాశం ఇస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి నుంచి ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. మొదటిరోజు ఏకంగా 5.24 లక్షల మంది హాజరయ్యారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం నిమిషం లేట్ అయిన పరీక్షకు అనుమతించబోము అని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ మాస్ ర్యాగింగ్.. ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు

Tejas Express: భారీగా లాభాలు తెచ్చిపెడుతున్న భారత్‌ మొట్టమొదటి ప్రైవేట్‌ రైలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు