క్రైమ్ మిర్రర్,జాతీయ న్యూస్:- మన దేశ రాజధాని ఢిల్లీలో పాకిస్తాన్ కు చెందిన ఒక ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో భద్రతా బలగాలు ఢిల్లీలో అప్రమత్తమయ్యాయి. ఎర్రకోట మరియు మత ప్రాధాన్యత సంతరించుకున్న ప్రాంతాలే లక్ష్యంగా ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడవచ్చు అని ఇంటలిజెన్స్ గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ఎర్రకోట సహా నగరంలోని ప్రతి రద్దీ ప్రాంతంలో భారీగా భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. పలు ప్రాంతాలలో పోలీసులు పకడ్బందీగా తనిఖీలు చేపట్టారు. గత ఏడాది ఎర్రకోటలో జరిగిన పేలుడు సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని భారీగా భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 6వ తేదీన పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని మసీదు వద్ద జరిగిన ఆత్మహతి దాడికి ప్రతీకారంగా ఎల్ఈడి దాడులను ప్లాన్ చేస్తుంది అని సమాచారం. ఇస్లామాబాద్ దాడిలో 31 మంది మరణించగా దాదాపు 160 మందికి పైగా గాయాలు పాలయ్యారు. అయితే ఈ దాడికి తామే బాధ్యులమని ఐ ఎస్ ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది.
ఢిల్లీలో హై అలెర్ట్.. ఉగ్రవాద ముప్పు!
By Vengal Reddy
0
396
Previous article
Next article
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్ఎడిటర్గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.
పాలిటిక్స్, టెక్నాలజీ, లైఫ్ స్టైల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
