Homeజాతీయంప్రపంచంలోని అన్ని సమస్యలకు పరిష్కారం చూపే సత్తా మన దేశానికి ఉంది : RSS చీఫ్

ప్రపంచంలోని అన్ని సమస్యలకు పరిష్కారం చూపే సత్తా మన దేశానికి ఉంది : RSS చీఫ్

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- మన దేశ చరిత్ర, బలం గురించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల సమస్యలకు పరిష్కారం చూపే సత్తా మన భారతదేశానికి ఉంది అని మోహన్ భగవత్ మన దేశంపై ప్రశంసలు కురిపించారు. అమెరికా చైనా వంటి దేశాలు కేవలం తాము శక్తివంతంగా మారడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రపంచానికి హాని కలిగిస్తున్నాయి అని తీవ్రంగా విమర్శించారు. భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కొన్ని పాశ్చాత్య దేశాలు తమ స్వార్థం కోసం మార్చేశాయని తాజాగా లక్నో యూనివర్సిటీలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్ఎప్పటికీ హిందూ దేశంగానే ఉంటుంది అని స్పష్టం చేశారు. ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపే సత్తా భారతదేశానికి ఉందని.. మిగతా దేశాల అన్నిటికీ ఈ విషయం తెలియాలి అంటే మన దేశంలో అన్ని రంగాలు కూడా మరింత శక్తివంతంగా ఉండే విధంగా చూడాలి అని పిలుపునిచ్చారు. దీంతో మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసేలా చేస్తున్నాయి. నిజానికి ప్రస్తుతం నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం ప్రపంచంలోనే ఒక శక్తివంత దేశంగా పేరు గడించింది. కాబట్టి మన మరింత బలంగా ఉండాలి అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో కూడా అభివృద్ధి అనేది పెరగాలి అని.. అప్పుడే ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంటుంది అని తెలిపారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments