Homeవైరల్Komatireddy Dupe: అచ్చం కోమటిరెడ్డి లాంటి వ్యక్తి, అదీ నల్లగొండలోనే.. చూస్తే ఆశ్చర్యపోవడం పక్కా!

Komatireddy Dupe: అచ్చం కోమటిరెడ్డి లాంటి వ్యక్తి, అదీ నల్లగొండలోనే.. చూస్తే ఆశ్చర్యపోవడం పక్కా!

  • నల్లగొండలో కోమటిరెడ్డి లాంటి మరో వ్యక్తి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • ఇంతకీ ఆయన ఎవరంటే?

అచ్చం కోమటిరెడ్డి వెంటక్ రెడ్డి లాంటి వ్యక్తి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వ్యక్తిని పోలిన వ్యక్తులు ఏడుగురు ఉంటారనేది నిజమే అని ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది. చాలా మంది ఈ వీడియోను చూసి కోమటిరెడ్డి వెర్షన్ 2.0 అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇంతకీ కోమటిరెడ్డి లాంటి వ్యక్తి ఎవరంటే?

చూడ్డానికి కోమటిరెడ్డిలా కనిపిస్తున్న వ్యక్తి పేరు కంభంపాటి బ్రహ్మయ్య. సొంతూరు ముగుగోడు మండలం పులిపలుపుల. సుమారు రెండు దశాబ్దాల క్రితమే నల్లగొండకు వచ్చారు. హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన కుల వృత్తి అయిన కుండల వ్యాపారం చేస్తున్నారు. ఎన్జీ కాలేజీకి ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల దుకాణ సముదాయంలో ఆయనకు ఓ స్టాల్ ఉంది. కుండలు అమ్మడంతో పాటు రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని కొలిచే అతడు.. ఎల్లమ్మ పండుగలు కూడా చేసేందుకు వెళ్తాడు. మొత్తంగా ఓ నెటిజన్ తీసిన వీడియో కారణంగా ఇప్పుడు ఆయన కోమటిరెడ్డి డూప్ పేరుతో నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన వీడియో చూసి నెటిజన్లు కూడా క్రేజీగా ఫీలవుతున్నారు. ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. వచ్చేసారి నల్లగొండ నుంచి కాంగ్రెస్ పార్టీ బ్రహ్మయ్యకు టికెట్ ఇవ్వాలంటూ జోక్స్ చేస్తున్నారు. మొత్తంగా కంభంపాటి బ్రహ్మయ్య నెట్టింట ట్రెండ్ అవుతున్నారు.

https://www.instagram.com/p/DU7XywDgZC1/

Read Also:  ఉచితాలు ఎంతకాలం? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments