Homeతెలంగాణమున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో విజ‌యం మాదే

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో విజ‌యం మాదే

  • 75శాతంపైగా గెలుస్తాం
  • మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహా

షాద్ నగర్, క్రైం మిర్ర‌ర్ః తెలంగాణ‌లో జ‌రుగ‌నున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో విజయం మాదేని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు

. 14వ వార్డు అభ్య‌ర్థి అందె మోహ‌న్ త‌రుపున షాద్‌న‌గ‌ర్‌లో ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పాల్గొని స్థానిక భ‌వాని మాత ఆల‌యం వ‌ద్ద ర‌చ్చ‌బండ ఏర్పాటు చేసి మ‌హిళ‌ల‌తో మాట్లాడారు.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో 75శాతంకు పైగా గెలుస్తామ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం చేస్తున్న సంక్షేమమే గెలుపిస్తుంద‌న్నారు.

అమ్మ బాగున్నారా.. మా పాల‌న ఎలా ఉంది … ప‌థ‌కాలుఅందుతున్నాయా అంటూ ఓట‌ర్ల‌ను ప‌ల‌క‌రించారు. త‌మ అభ్య‌ర్థి అందెమోహన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు