Homeతెలంగాణసాధ్యంకాని హామీలిచ్చి గ‌ద్దెనెక్కిన కాంగ్రెస్‌

సాధ్యంకాని హామీలిచ్చి గ‌ద్దెనెక్కిన కాంగ్రెస్‌

  • రాష్ట్రంలో ప్ర‌జ‌లు అసంతృప్తిలో ఉన్న‌రు
  • మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో గుణ‌పాఠం చెప్పాలి
  • మున్సిపల్ ప్రచారంలో నిలదీసిన హరీష్ రావు
సంగారెడ్డి,క్రైం మిర్ర‌ర్ః
సాధ్యం కాని హామీల‌తో గ‌ద్దెనెక్కిన కాంగ్రెస్ స‌ర్కార్ గెలిచిన రెండేళ్ల‌లో చేసింది శూన్య‌మ‌ని మాజీ మంత్రి, బీఆరఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు మండిప‌డ్డారు.
ప‌ట‌న్ చెరువునియోజ‌క‌వ‌ర్గంలోని జిన్నారం మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొని మాట్లాడారు.
మేము అధికారంలోకి ఉన్న‌ప్ప‌డు జిన్నారంను గ్రామ పంచాయ‌తీగా ఉంటేనే అభివృద్ది చెందుతుంద‌ని భావించి మున్సిప‌ల్ చేయ‌లేద‌న్నారు.
ఇప్ప‌డు కాంగ్రెస్ అధికారంలోకి రాగ‌నే వెంట‌నే జిన్నారంను మున్సిప‌ల్‌గా ప్ర‌క‌టించి ప్ర‌జ‌ల పై ప‌న్న‌లు భారం మోపింద‌ని విమ‌ర్శించారు.
ఈ సంద‌ర్భంగాఇంటింటా తిరుగుతూ ప్ర‌జ‌ల‌తో ముచ్చ‌టించి బీఆర్ ఎస్‌కు ఓటువేసి ఆద‌రించాల‌ని కోరారు.
కేసీఆర్ రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.2000 చేస్తానని హామీ ఇచ్చి
అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే హామిని నెర‌వేర్చార‌న్నారు.
రేవంత్ రెడ్డి రూ.4000 ఇస్తానని చెప్పి రెండేళ్లు గడిచినా ఇవ్వడం లేదని విమర్శించారు. ఏపీలో చంద్రబాబు రూ.4000 ఇస్తానని చెప్పి ఇస్తున్నాడు కదా? మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి ఎందుకు చేతులు రావడం లేదు..? అని ప్రశ్నించారు.
మహాలక్క్ష్మి పథకం కింద నెలకు రూ.2500 ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేశాడని విమర్శించారు. ఏ ఊర్లో చూసినా సగం మంది రైతుల‌కు కూడ రుణమాఫీ కాలేదన్నారు.
ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటుతో త‌గిన బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చారు. రెండేళ్లు ఓపిక పట్టాలని, వచ్చేది మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు.
రేవంత్ రెడ్డి ముస్లింలకు ఒక్క రూపాయి పని కూడా చేయలేదని, కాబట్టి అందరూ ఏకమై కారు గుర్తు అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు