HomeతెలంగాణBig Breaking: ఇళ్లను అమ్మినా లేదా అద్దెకు ఇచ్చినా ఇక జైలుకే...!

Big Breaking: ఇళ్లను అమ్మినా లేదా అద్దెకు ఇచ్చినా ఇక జైలుకే…!

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ (2BHK) ఇళ్లను అమ్మినా లేదా అద్దెకు ఇచ్చినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. కేవలం తర్వాతి తరానికి వారసత్వంగా మాత్రమే అందించగలరు.

ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం పేద, నిరాశ్రయులైన కుటుంబాలకు శాశ్వత గృహవసతిని కల్పించడం, తద్వారా వారు అద్దె చెల్లించే భారం నుండి విముక్తి పొందడం. ఈ ఇళ్లు నిరుపేద కుటుంబాలకు ఉచితంగా, గౌరవప్రదమైన గృహవసతి కల్పించే “గౌరవ గృహనిర్మాణ పథకం” (Dignity Housing Scheme) కింద కేటాయించబడ్డాయి.

ఇళ్లను అద్దెకు ఇచ్చినట్లు లేదా విక్రయించినట్లు తేలితే, ఆ ఇంటి కేటాయింపును ప్రభుత్వం రద్దు చేస్తుందిని సమాచారం. అలాగే డబ్బు ఆశచూపి ఇళ్లను విక్రయించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఈ నిబంధనలను ఎవరైనా  ఉల్లంఘిస్తే ప్రభుత్వం ఇళ్లను తిరిగి స్వాధీనం చేసుకుంటుందని అధికారులు స్పష్టం చేశారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు